సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Varun Tej: 'బరి’ పై వరుణ్‌ తేజ్‌ ఫోకస్‌.. ఈసారి గెలుపే టార్గెట్‌!

ABN, Publish Date - Aug 27 , 2026 | 03:35 PM

ఒక సినిమా సక్సెస్‌ తర్వాత వెంటనే మరో కథను ఎంచుకోవడం అంత సులభమైన విషయం కాదని వరుణ్‌ తేజ్‌ అంటున్నారు. ‘కొరియన్‌ కనకరాజు’ విజయంతో మంచి జోష్‌లో ఉన్న ఆయన తన తదుపరి చిత్ర ‘బరి’పై పూర్తి దృష్టి పెట్టారు.

ఒక సినిమా సక్సెస్‌ తర్వాత వెంటనే మరో కథను ఎంచుకోవడం అంత సులభమైన విషయం కాదని వరుణ్‌ తేజ్‌ అంటున్నారు. ‘కొరియన్‌ కనకరాజు’ విజయంతో మంచి జోష్‌లో ఉన్న ఆయన తన తదుపరి చిత్ర ‘బరి’పై పూర్తి దృష్టి పెట్టారు. ప్రేక్షకుల అభిరుచిని అర్థం చేసుకుని, తనకు సరిపోయే కథను ఎంచుకోవడానికి మళ్లీ మొదటి నుంచి ప్రయాణం మొదలు పెట్టినట్టే ఉంటుందని వరుణ్‌ తేజ్‌ తెలిపారు. అదృష్టవశాత్తూ ‘బరి’లాంటి అద్భుతమైన కథ దొరికిందని, ప్రస్తుతం తన సోదరి నిహారిక కొణిదెలతో కలిసి ఈ ప్రాజెక్ట్‌పై పనిచేస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. స్పోర్ట్స్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి యదు వంశీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో వరుణ్‌ వాలీబాల్‌ ప్లేయర్‌గా కనిపించనున్నారు. గతంలో నటించిన ‘గని’ చిత్రం ఎందుకు వర్కవుట్‌ కాలేదన్న ప్రశ్నకు సమాధానమిచ్చారు. ఆ సినిమాలో చాలా అంశాలను ఒకేసారి కలపడానికి ప్రయత్నించామని, అదే ప్రధాన సమస్యగా మారిందని పేర్కొన్నారు. కానీ ‘బరి’ విషయంలో అలాంటి గందరగోళం ఉండదని, ప్రేక్షకులకు ఏం చెప్పాలనుకుంటున్నామో దానిపై టీమ్‌కు పూర్తి స్పష్టత ఉందని తెలిపారు.


ఇంకా ఆయన మాట్లాడుతూ ‘బరి’ చాలా నేటివ్‌గా, మన నేటివిటీకి దగ్గరగా ఉండే కథ. నాకు స్పోర్ట్స్‌ అంటే ఎంతో ఇష్టం. అందుకే ఈ కథకు మరింతగా కనెక్ట్‌ అయ్యాను. ‘కమిటీ కుర్రోళ్లు’తో జాతీయ అవార్డు అందుకున్న యదు వంశీ మానవీయ భావోద్వేగాలను బలంగా తెరకెక్కించగలడనే నమ్మకం ఉంది. ఈ తరహా కథలో నటించాలనే కోరిక ఎప్పటినుంచో ఉంది’ అని అన్నారు. ‘బరి’ షూటింగ్‌ రిహార్సల్స్‌ సమయంలో గాయపడ్డ వరుణ్‌తేజ్‌ మోకాలికి శస్త్రచికిత్స జరిగింది. కోలుకున్న తర్వాత మళ్లీ షూటింగ్‌లో అడుగుపెడతారు. ‘నేను, చెల్లి నిహారిక కలిసి సినిమా చేయాలని ముందుగా ప్లాన్‌ చేసింది కాదు. నిహారికే ఈ ఆలోచనను నా దగ్గరకు తెచ్చింది. కథ నచ్చడంతో వెంటనే అంగీకరించాను. యువతతో కలిసి పనిచేయడంపై ఆసక్తికొత్త ఆలోచనలతో, ప్యాషన్‌తో పనిచేసే యువతతో కలిసి సినిమా చేయడం ఎంతో ఇష్టం’ అని అన్నారు.

Updated Date - Aug 27 , 2026 | 03:48 PM