రాజాసాబ్ ప్లాప్.. మెగాహీరోతో మారుతి
ABN, Publish Date - Jul 21 , 2026 | 05:54 PM
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej), దర్శకుడు మారుతి (Maruthi) కాంబినేషన్‌లో ఒక భారీ ప్రాజెక్ట్ రాబోతోందంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జోరుగా వార్తలు చక్కర్లు కొట్టాయి.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej), దర్శకుడు మారుతి (Maruthi) కాంబినేషన్‌లో ఒక భారీ ప్రాజెక్ట్ రాబోతోందంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జోరుగా వార్తలు చక్కర్లు కొట్టాయి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో హారర్-కామెడీ డ్రామాగా తెరకెక్కించిన రాజా సాబ్ (The Raja Saab) సినిమా తర్వాత మారుతి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎవరితో ఉంటుందనే ఉత్కంఠ నెలకొంది. ఆ సినిమా ఇచ్చిన రిజల్ట్ తో కొన్ని నెలలు బయట ఎక్కడా కనిపించని మారుతి.. ప్రస్తుతం ఒక కొత్త స్క్రిప్ట్ ని రెడీ చేసే పనిలో ఉన్నాడట. ఈ క్రమంలోనే మారుతి మార్క్ వినోదంతో వరుణ్ తేజ్ హీరోగా ఒక సినిమా ప్లాన్ చేస్తున్నారనే ప్రచారం మెగా అభిమానుల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తించింది.
అయితే, తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది. వరుణ్ తేజ్ – మారుతి కాంబోలో సినిమా రాబోతోందనేది కేవలం ఒక పుకారు మాత్రమేనని సినీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుతం వరుణ్ తేజ్ దర్శకుడు మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన కొరియన్ కనకరాజు సినిమాతో బిజీగా ఉన్నాడు. మరోవైపు మారుతి కూడా తన తదుపరి స్క్రిప్ట్‌పై దృష్టి సారించారు తప్ప, వీరిద్దరి మధ్య ఎలాంటి కథా చర్చలు జరగలేదని సమాచారం.
ఇక ఈ రకంగా ఇద్దరూ తమ తమ సరికొత్త ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో, సోషల్ మీడియాలో వస్తున్న కాంబినేషన్ వార్తలు కేవలం ఊహాగానాలకే పరిమితమని తెలుస్తోంది. మారుతి మాత్రం రాజాసాబ్ ని ప్రేక్షకులు మర్చిపోయేలా చేసే కథ కోసం కష్టపడుతున్నట్లు సమాచారం. మరి మారుతికి అంతా మంచి హిట్ ఇచ్చే హీరో ఎవరు.. ? అనేది తెలియాలంటే ఆయన తదుపరి చిత్రం అధికారికంగా ప్రకటించేవారకు ఆగాల్సిందే.