Varanasi: గ్లోబల్ వేదికపై ‘వారణాసి’ ఎక్స్‌క్లూజివ్ కంటెంట్..
ABN, Publish Date - Apr 23 , 2026 | 11:31 AM
దర్శకుడు రాజమౌళి (SS Rajamouli) ఏం చేసినా సంచలనమే అవుతుంది. సినిమాను జనాల్లోకి ఎలా తీసుకెళ్లాలి, ఎలా హైప్ క్రియేట్ చేయాలి అన్నది ఆయనకు బాగా తెలుసు.
దర్శకుడు రాజమౌళి (SS Rajamouli) ఏం చేసినా సంచలనమే అవుతుంది. సినిమాను జనాల్లోకి ఎలా తీసుకెళ్లాలి, ఎలా హైప్ క్రియేట్ చేయాలి అన్నది ఆయనకు బాగా తెలుసు. గ్లోబల్ స్టాయిలో ఆయన చిత్రాలకు ప్రమోషన్ దక్కుతుంది అంటే.. దానికి ఆయన విజన్ కారణం. ప్రస్తుతం జక్కన్న సూపర్‌స్టార్ మహేశ్ (Mahesh Babu) హీరోగా ‘వారణాసి’ (Varanasi) చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. దుర్గా ఆర్ట్స్ పతాకంపై కె.ఎల్ నారాయణ ప్రతిష్ఠాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘వారణాసి’ సినిమాకు సంబంధించిన ఓ వార్తను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయగా వైరల్ అవుతోంది. ఈ నెల 24న మెక్సికోలో జరగనున్న ఓ వేడుకలో ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలను ప్రదర్శించనున్నట్లు అధికారిక సోషల్ మీడియా పేజీ ద్వారా వెల్లడించారు.
అలాగే అక్కడ ప్రేక్షకులతో దర్శకుడు రాజమౌళి వీడియో ద్వారా ఇంటరాక్ట్ కానున్నారని కూడా తెలిపారు. ఈ నెల 24 నుంచి 26 వరకు మెక్సికోనే జరగనున్న ‘కామిక్ కాన్ ఎక్స్‌పీరియన్స్‌లో ‘వారణాసి’కి సంబంధించిన ఎక్స్‌క్లూజివ్ కంటెంట్‌ను ప్రదర్శించనున్నారు. ఆ వేదికపై ఈ సినిమాకు సంబంధించిన మేకింగ్ వీడియోలు, బిహైండ్ ది సీన్స్‌తోపాటు, కీలక సన్నివేశాలతో కూడిన గ్లింప్స్‌ను ప్రేక్షకులకు చూపించనున్నారు. ఈ కార్యక్రమానికి ఎస్‌ఎస్ కార్తికేయ హాజరుకానున్నారు. రాజమౌళి వీడియో ద్వారా అక్కడి అభిమానులతో మాట్లాడతారు. మహేశ్ సరసన ప్రియాంక చోప్రా నటిస్తున్నారు. పృథ్వీరాజ్ సుకుమారన్ నెగటివ్ షేడున్న పాత్రలో కనిపించనున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా ఐమ్యాక్స్ ఫార్మెట్‌లో ఈ సినిమా విడుదల కానుంది.