సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Varanasi: 'వారణాసి' టైటిల్ వివాదానికి ముగింపు.. స్వచ్ఛందంగా ఇచ్చిన సుబ్బారెడ్డి

ABN, Publish Date - Jul 23 , 2026 | 03:07 PM

 'వారణాసి' టైటిల్ గురించి కొద్దిరోజులుగా దర్శకుడు సుబ్బారెడ్డి, వారణాసి చిత్ర నిర్మాత కెఎల్ నారాయణకు మధ్య వివాదం జరుగుతున్న సంగతి తెలిసిందే. 

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం 'వారణాసి'. ఈ టైటిల్ గురించి కొద్దిరోజులుగా దర్శకుడు సుబ్బారెడ్డి, వారణాసి చిత్ర నిర్మాత కెఎల్ నారాయణకు మధ్య వివాదం జరుగుతున్న సంగతి తెలిసిందే.  నిర్మాతల మండలి, దర్శకుల సంఘం సభ్యుల చొరవతో టైటిల్ సమస్యకు పరిష్కారం దొరికింది. ఇప్పుడు దర్శక నిర్మాత ఈ టైటిల్ ను అగ్ర నిర్మాత కెఎల్ నారాయణకు  స్వచ్చందంగా ఇచ్చారు. 

ఈ మేరకు సుబ్బారెడ్డి మాట్లాడుతూ '2023లో 'వారణాసి' టైటిల్‌ను రిజిస్టర్ చేయించాను. ఆ పేరుతో ఓ కథపై పని ప్రారంభించాను.  అయితే  ఇదే టైటిల్ రాజమౌళి-మహేష్ బాబు కలయికలో వస్తున్న సినిమాకు అవసరమైందని తెలిసింది. తెలుగు సినిమా గౌరవాన్ని దృష్టిలో పెట్టుకుని, రాజమౌళి, మహేష్ బాబు కలయికలో భారీగా వస్తున్న ఈ సినిమాకు మంచి జరగాలని అలోచించి ఈ టైటిల్ ను వారికి ఇచ్చేయాలని  నిర్ణయించుకున్నాను. టైటిల్ ఇచ్చినందుకు ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు,  తీసుకోవాలనే ఆలోచన కూడా రాలేదు. ఈ టైటిల్ నాకు ఓ  ఎమోషన్. దాన్ని అమ్మడం కోసం కాదు.. మంచి సినిమా కోసం ఇవ్వడం నాకు ఆనందంగా అనిపించింది' అని పేర్కొన్నారు.

దర్శకుల సంఘం మాజీ అధ్యక్షుడు వీరశంకర్ మాట్లాడుత 'ఈ టైటిల్‌పై   సుబ్బారెడ్డి   ఎంతో భావోద్వేగంతో ఉన్నారు. అయితే రాజమౌళి, నిర్మాత కేఎల్ నారాయణ  చేస్తున్న చిత్రానికి ఈ టైటిల్ ఇస్తే తెలుగు సినీ పరిశ్రమకు మంచి సందేశం వెళ్తుందని, ఈ సహకారం పరిశ్రమలో మంచి సంప్రదాయానికి నాంది పలుకుతుందని, టైటిళ్లను వ్యాపారంగా కాకుండా పరస్పర గౌరవంతో పంచుకోవడం అభినందనీయం' అని అన్నారు. 

Updated Date - Jul 23 , 2026 | 03:12 PM