సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

వరలక్ష్మి-నవీన్ చంద్ర ‘పోలీస్ కంప్లైంట్’ ట్రైలర్ రిలీజ్.. సూప‌ర్‌స్టార్‌ కృష్ణపై ప్రత్యేక గీతం

ABN, Publish Date - Jun 01 , 2026 | 06:52 PM

వరలక్ష్మి శరత్‌కుమార్, నవీన్ చంద్ర నటించిన హారర్ యాక్షన్ థ్రిల్లర్ ‘పోలీస్ కంప్లైంట్’ ట్రైలర్ విడుదలైంది. సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా ప్రత్యేక గీతాలను కూడా ఆవిష్కరించారు.

Police Complaint

వరలక్ష్మి శరత్‌కుమార్ (Varalaxmi Sarathkumar), నవీన్‌ చంద్ర (Naveen Chandra) ప్రధాన పాత్రధారులుగా నటించిన హారర్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘పోలీస్‌ కంప్లైంట్‌’ (Police Complaint,). సంజీవ్‌ మేగోటి దర్శకత్వంలో బాలకృష్ణ మహారాణా నిర్మించారు. సినిమా ఈనెల 12న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సూపర్‌స్టార్‌ కృష్ణ ఘట్టమనేని జయంతిని పురస్కరించుకుని ఆదివారం నిర్వహించిన ప్రత్యేక వేడుకలో ట్రైలర్‌తో రెండు ప్రత్యేక గీతాలను మేకర్స్‌ విడుదల చేశారు.

కృష్ణ నటించిన పలు చిత్రాల టైటిళ్లను గుర్తు చేస్తూ రూపొందించిన ఈ సినిమాలోని స్పెషల్‌ సాంగ్‌ని కృష్ణ అభిమానుల చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ పాటలో కృష్ణ వీరాభిమాని, నటుడు కృష్ణసాయి నటించారు. ‘నువ్వట్టా సూత్తా ఉంటే’ అనే మరో గీతాన్ని తెలంగాణ డీఐజీ రమణారెడ్డి విడుదల చేశారు. కార్యక్రమంలో నిర్మాతల మండలి కార్యదర్శి ప్రసన్న కుమార్‌, కృతి వర్మ, ప్రీతీ సుందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 01 , 2026 | 06:52 PM