సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

వైష్ణవి చైతన్య రియల్ ఏజ్.. ఆధార్ కార్డు చూపించి మరీ చెప్పిందిగా

ABN, Publish Date - Sep 21 , 2026 | 04:42 PM

బేబి (Baby) సినిమాతో టాలీవుడ్‌లో సరికొత్త సంచలనం సృష్టించి, తన అద్భుతమైన నటనతో యూత్ మరియు కుర్రకారు మనసులను దోచుకున్న యంగ్ అండ్ బ్యూటిఫుల్ హీరోయిన్ వైష్ణవి చైతన్య.

Vaishnavi Chaitanya

బేబి (Baby) సినిమాతో టాలీవుడ్‌లో సరికొత్త సంచలనం సృష్టించి, తన అద్భుతమైన నటనతో యూత్ మరియు కుర్రకారు మనసులను దోచుకున్న యంగ్ అండ్ బ్యూటిఫుల్ హీరోయిన్ వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya). ఈమధ్య ఎపిక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ, ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని దక్కించుకోలేకపోయింది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లోనే అమ్మది వయస్సు గురించి ట్రోలింగ్ నడిచింది. వైష్ణవి వయస్సు 32 అని.. ఆనంద్ దేవరకొండ కన్నా పెద్దది అని రకరకాలుగా పుకార్లు వచ్చాయి.గూగుల్, వికీపీడియాలో ఆమె వయసు 32 ఏళ్లుగా చూపించడంతో, నెటిజన్లు ఆశ్చర్యపోతూ రకరకాల కామెంట్లు చేశారు. దీంతో ఈ వ్యవహారం టాలీవుడ్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.


తాజాగా వైష్ణవి తనపై వస్తున్న వయసు రూమర్స్‌పై స్పందిస్తూ షాకింగ్ క్లారిటీ ఇచ్చింది. వికీపీడియాలో తన సమాచారం తప్పుగా ఉందంటూ వస్తున్న ప్రచారానికి స్వయంగా ఫుల్‌స్టాప్ పెట్టింది. ఒక పాడ్ క్యాస్ట్ లో పాల్గొన్న వైష్ణవి మాట్లాడుతూ.. 'వికీపీడియాలో నా వయసు 32 ఏళ్లుగా చూపిస్తున్నారు, కానీ అందులో ఎలాంటి నిజం లేదు. అది పూర్తిగా తప్పు సమాచారం. నాకు ప్రస్తుతం 25 ఏళ్లు మాత్రమే. 2001లో పుట్టాను. ఇది నా ఆధార్ కార్డు. కేవలం నా వయసు విషయమే కాదు.. నా పుట్టిన ప్రదేశం విషయంలోనూ వికీపీడియాలో అనేక తప్పులు ఉన్నాయి' అని స్పష్టం చేసింది.


ఇక దీంతో గత కొన్ని రోజులుగా ఆమె ఏజ్‌ పై సోషల్ మీడియాలో జరుగుతున్న ఊహాగానాలకు, నెగెటివ్ ప్రచారానికి పూర్తిగా తెరపడినట్లైంది. ప్రస్తుతం వైష్ణవి ఇచ్చిన ఈ క్లారిటీ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుండటంతో, అభిమానులు వికీపీడియాలో సరైన సమాచారాన్ని వెంటనే అప్‌డేట్ చేయాలని కోరుతున్నారు. ఇక అమ్మడి సినిమాల విషయానికొస్తే తమిళ్ లో ఆర్యతో ఒక సినిమా చేస్తుంది.

Rashmika Mandanna: షూటింగ్‌కు వెళ్లాలంటే.. వణుకు పుట్టింది

మ‌ళ్లీ ఏమైందిరా.. వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ రిలీజ్ డేట్‌పై సస్పెన్స్

Husharu Pittalu: ఒరేయ్.. ఏం సినిమారా ఇది.. ఇంట్లోవాళ్లతో చూస్తే చెప్పుతో కొడతారు

Updated Date - Sep 21 , 2026 | 04:56 PM