Ravi Teja: వామ్మో... వాయ్యో... సాంగ్ వచ్చేసింది!
ABN , Publish Date - Jan 02 , 2026 | 04:54 PM
మాస్ మహరాజా రవితేజ తాజా చిత్రం 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' నుండి అవుట్ అండ్ అవుట్ మాస్ సాంగ్ 'వామ్మో... వాయ్యో...' వచ్చేసింది. ఆషికా రంగనాథ్, డింపుల్ హయతీ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించాడు. హీరోతో కలిసి ఇద్దరూ హీరోయిన్లు వేస్తున్న మాస్ స్టెప్ట్స్ తో సాగిన ఈ పాటను చూస్తుంటే ప్రీ క్లయిమాక్స్ సాంగ్ అనే విషయం అర్థమైపోతోంది. హీరోహీరోయిన్లు కలర్ ఫుల్ అవుట్ ఫిట్స్ తో అదరగొట్టమే కాదు... కర్టెన్ బిఫోర్ ఆడియెన్స్ మెచ్చేలా దరువుకు తగ్గ స్టెప్పులు వేశారు. జానపద గీతాన్ని తలపించేలా దీనిని దేవ్ పవర్ రాయగా, స్వాతిరెడ్డి యు.కె. పాడింది. ఈ పాటకు శేఖర్ మాస్టర్ నృత్య రీతులు సమకూర్చారు. కిశోర్ తిరుమల దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి నిర్మించిన 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' ఈ నెల 13న విడుదల కాబోతోంది.