సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

V Samudra: సముద్ర చేతుల మీదుగా   '1+1 ఆఫర్' ట్రైలర్ 

ABN, Publish Date - Feb 01 , 2026 | 12:51 PM

నిమ్మల శ్రీరామ్, మౌనిక హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా '1+1 ఆఫర్'. త్రివేణి పిక్చర్స్ బ్యానర్ పై వి.వేణుగోపాల్ రెడ్డి నిర్మించారు

నిమ్మల శ్రీరామ్(Nimmala Sriram) , మౌనిక (Mounika) హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా '1+1 ఆఫర్' (1+1 Offer Movie). త్రివేణి పిక్చర్స్ బ్యానర్ పై వి.వేణుగోపాల్ రెడ్డి నిర్మించారు .ఏఎస్ఆర్ (శ్రీరామ్) దర్శకత్వం వహించారు. త్వరలో ఈ  సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. శుక్రవారం హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ లో దర్శకుడు వి. సముద్ర, నటుడు 30 ఇయర్స్ ఫృథ్వీ చేతుల మీదుగా ఈ చిత్ర ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు.  
  

దర్శకుడు వి సముద్ర మాట్లాడుతూ '1+1 ఆఫర్' ట్రైలర్ చాలా బాగుంది. ఈ సినిమాతో వన్ ఫ్లస్ హండ్రెడ్ అనేలా దర్శకుడు శ్రీరామ్ గారు వంద సినిమాలు చేయాలి. విలన్ రాజేష్ ను చూస్తుంటే మన విలన్ అజయ్ లా కనిపిస్తున్నారు' అన్నారు. 

దర్శకుడు ఏఎస్ఆర్( శ్రీరామ్) మాట్లాడుతూ 'మొదట కాలం కలిసివస్తే అనే టైటిల్ పెట్టుకున్నాం. కానీ అది మరీ ఓల్డ్ టైటిల్ లా అనిపించి.1+1 ఆఫర్  ఫిక్స్ చేశాం. సినిమా చూశాక ఈ కథకు ఇది సరైన టైటిల్ అని ప్రేక్షకులే చెబుతారు. కంటెంట్ ఓరియెంటెడ్ మూవీ ఇది.  త్వరలోనే మీ ముందుకు మూవీని తీసుకొస్తాం' అన్నారు. 

Updated Date - Feb 01 , 2026 | 01:19 PM