హరీష్ శంకర్: పెర్ఫార్మెన్స్ బద్దలైపోయిద్ది అని చెప్పేది అందుకే!
ABN, Publish Date - Mar 12 , 2026 | 06:38 PM
'కళ్యాణ్ గారు ఈ సినిమాకు ప్రాణం పెట్టి పని చేశారు. ఈసారి పర్ఫార్మెన్స్ బద్దలైపోయిద్ది అని నేను మొదటి నుంచి ఎందుకు చెప్తున్నానంటే..
'కళ్యాణ్ గారు ఈ సినిమాకు ప్రాణం పెట్టి పని చేశారు. ఈసారి పర్ఫార్మెన్స్ బద్దలైపోయిద్ది అని నేను మొదటి నుంచి ఎందుకు చెప్తున్నానంటే.. సెకండ్ హాఫ్ లో ఇంటెన్స్ సీన్స్ లో అద్భుతంగా నటించారు. ఆయన వేసిన డ్యాన్స్ కి చప్పట్లు, ఈలలతో సెట్ అంతా దద్దరిల్లిపోయింది' అని దర్శకుడు హరీష్ శంకర్ (Harisha Shankar)అన్నారు.
'గబ్బర్ సింగ్' వంటి సంచలన విజయం తర్వాత పవన్ (Pawan Kalyan), హరీష్ కలయికలో వస్తోన్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్' (Ustaad Bhagat singh). రాశీ ఖన్నా, శ్రీలీల కథానాయికలు. అభిమానుల ఉత్సాహాన్ని, సినిమాపై అంచనాలను పెంచుతూ చిత్రబృందం 'కాలరే ఎత్తరా' అంటూ సాగే మూడో పాటను గురువారం సాయంత్రం అభిమానుల కోలాహలం నడుమ విమల్ థియేటర్ లో విడుదల చేశారు. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ అద్భుతమైన సంగీతం, రామ్ మిర్యాల ఉత్సాహభరితమైన గానం, కాసర్ల శ్యామ్ సాహిత్యం ఈ పాటను మరో స్థాయిలో నిలపెట్టింది. ఈ నెల 19న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇంటెన్స్ సీన్స్ లో అదరగొట్టేశారు: హరీష్ శంకర్
'కళ్యాణ్ గారు ఈ సినిమాకు ప్రాణం పెట్టి పని చేశారు. ఈసారి పర్ఫార్మెన్స్ బద్దలైపోయిద్ది అని నేను మొదటి నుంచి ఎందుకు చెప్తున్నానంటే.. సెకండ్ హాఫ్ లో ఇంటెన్స్ సీన్స్ లో ఆయన అద్భుతంగా నటించారు. ఆయన వేసిన డ్యాన్స్ కి చప్పట్లు, ఈలలతో సెట్ అంతా దద్దరిల్లిపోయింది. దేవి శ్రీ ప్రసాద్ అదే రేంజ్ మ్యూజిక్ అందించారు. మైత్రి మూవీ మేకర్స్ ఎక్కడా రాజీ పడకుండా సినిమాను నిర్మించారు. కెరీర్ లోనే భారీ సెట్ ను ఈ పాట కోసం వేశారు. ఇలాంటి నిర్మాతలు దొరకడం నా పూర్వజన్మ సుకృతం' అన్నారు
గబ్బర్ సింగ్ స్థాయికి తగ్గకూడదనే: రవిశంకర్
'ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చాలా బాగా వచ్చింది. 'గబ్బర్ సింగ్' స్థాయికి తగ్గకూడదనే కసితో దర్శకుడు హరీష్ శంకర్ ఈ సినిమాని తెరకెక్కించారు. పవన్ కళ్యాణ్ గారితో గుర్తుండిపోయే చిత్రం చేయాలని అందరూ కోరుకుంటారు. అలాంటి అద్భుతమైన చిత్రాన్ని మాకు ఇచ్చినందుకు హరీష్ శంకర్ గారికి కృతజ్ఞతలు. ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ గారు పడిన కష్టం న భూతో న భవిష్యతి. ప్రజా సేవలో తీరిక లేకుండా ఉండి కూడా.. ఈ సినిమా పట్ల ఆయన చూపిన అంకితభావానికి హ్యాట్సాఫ్. 'ఖుషి' నాటి రోజులను గుర్తుచేసేలా ఈ సినిమా ఉంటుందని అభిమానులకు హామీ ఇవ్వగలను' అన్నారు.
ఒకే ఒక్క కోరిక : రాశి ఖన్నా
'నా కెరీర్ ప్రారంభంలో పవన్ కళ్యాణ్ గారితో కలిసి నటించాలని ఒకే ఒక్క కోరిక ఉండేది. నాకు ఈ అవకాశం ఇచ్చిన హరీష్ శంకర్ గారికి ధన్యవాదాలు. ఒక మాస్ సాంగ్ లో పవన్ కళ్యాణ్ గారితో కలిసి డ్యాన్స్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాలో వింటేజ్ పవన్ ను చూస్తారు' అన్నారు.
ఆ వెలితి తీరిపోయింది: కాసర్ల శ్యామ్
'భీమ్లా నాయక్ లో రెండు మంచి పాటలు రాసినప్పటికీ పవన్ కళ్యాణ్ గారికి మంచి డ్యాన్స్ నెంబర్ రాయలేదనే వెలితి ఉండేది. 'కాలరే ఎత్తరా'తో ఆ వెలితి తీరిపోయింది. దేవి శ్రీ ప్రసాద్ గారి సంగీతం అదిరిపోయింది. ఈ ఉగాది పండుగను 'ఉస్తాద్ భగత్ సింగ్'తో మరింత ఉత్సాహంగా జరుపుకొందాం' అన్నారు.