సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

హరీశ్‌ శంకర్‌: అభిమానులకు ఎలివేషన్‌ ఇవ్వడానికే ఆ డైలాగ్‌

ABN, Publish Date - Mar 19 , 2026 | 04:58 PM

‘పవన్‌కల్యాణ్‌గారి నుంచి మనమంతా ఓ గుణం నేర్చుకోవాలి. ఏదైనా అడిగినా, కష్టమని చెప్పినా ఆయన స్పందించే గుణాన్ని తెలుసుకోవాలి. ఆయనలో ఉన్న మంచి క్వాలిటీ అది' అన్నారు హరీశ్‌ శంకర్‌.

‘పవన్‌కల్యాణ్‌ గారి (Pawan Kalyan) నుంచి మనమంతా ఓ గుణం నేర్చుకోవాలి. ఏదైనా అడిగినా, కష్టమని చెప్పినా ఆయన స్పందించే తీరును తెలుసుకోవాలి. ఆయనలో ఉన్న మంచి క్వాలిటీ అది. ప్రతిసారీ హీరోని అభిమానులు ఎలివేట్‌ చేస్తుంటారు. బట్‌ ఎ చేంజ్‌... ఈసారి హీరో చేత అభిమానులకు ఎలివేషన్‌ ఇచ్చాం. అందుకే ‘నా అభిమానులను లేపేస్తావా? ఎంతమంది ఉంటారో తెలుసా? లెక్కపెట్టడానికే జన్మ సరిపోదు’ అనే డైలాగ్‌ రాశాను. ఇది కేవలం సినిమాటిక్‌ గా రాసిందే కానీ.. ఇంకే ఉద్దేశంలేదు’ అని హరీశ్‌ శంకర్‌ అన్నారు. పవన్‌కల్యాణ్‌ హీరోగా ఆయన దర్శకత్వం వహించిన చిత్రం ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మించిన ఈ చిత్రం ఉగాది సందర్భంగా గురువారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. సినిమాకొస్తున్న స్పందన గురించి చిత్ర బృందం స్పందించింది.

హరీశ్‌ శంకర్‌ మాట్లాడుతూ ‘ఏ టూ జెడ్‌ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండాలని ముందే ప్లాన్‌ చేశాం. పవన్‌కల్యాణ్‌ ఇచ్చిన తక్కువ సమయంలో ఇలాంటి మాస్‌ మసాలా సినిమా చేయడం చాలా కష్టం. కానీ నిర్మాణ సంస్థ ప్రణాళిక, కల్యాణ్‌గారి సపోర్ట్‌తోనే సాధ్యమైంది. అలాగే నా టీమ్‌ అంతా సరిహద్దుల్లో కాపలా కాసే సైనికుల్లా పని చేశారు. అందుకే మేం అనుకున్నట్లు 19న సినిమా రిలీజ్‌ చేయగలిగాం. దేవిశ్రీ ప్రసాద్‌ బిజీగా ఉండటంతో తమన్‌కు ఇచ్చిన 13 రోజుల్లో నేపథ్య సంగీతం అత్యద్భుతంగా ఇచ్చాడు. మేం ముందు నుంచి చెప్పినట్లుగానే సినిమాకు చక్కని స్పందన వస్తోంది. చాలామంది ఇంతమంచి కంటెంట్‌ను బయటకు ఎందుకు చెప్పలేదని అడుగుతున్నారు. ఈ కంటెంట్‌ తయారు చేయడానికే బాగా టైమ్‌ పట్టింది. సినిమాటిక్‌ లిబర్జీ తీసుకుని పవన్‌కల్యాణ్‌ గారికి సంబంధించిన కొన్ని సన్నివేశాలు జత చేయవచ్చు కానీ.. అందులో చిన్న డైలాగ్‌ సింక్‌ అయినా పొలిటికల్‌ సెటైర్లు మొదలవుతాయి. ఇప్పటిదాకా ఎవరూ చూపించని అక్రమ వలసదారుల గురించి చూపించాం. 'తొలిప్రేమ' సాంగ్‌కు మంచి రెస్పాన్స్‌ వస్తోంది. ఇందులో హీరోయిన్‌ ఫ్రెండ్‌ పల్లవి సన్నివేశంలో పవన్‌ చలించిపోయి నటించారు. గ్లిజరిన్‌ లేకుండానే ఈ సీన్‌ చేశారు. ఇలా సినిమాలో ఎన్నో మంచి అంశాలున్నాయి. అన్నింటిని ప్రేక్షకులు మెచ్చుకుంటున్నారు. మాస్‌, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ కాబట్టి ఓవర్సీస్‌లో రెస్పాన్స్‌ నెమ్మదిగా వస్తుందని అనుకున్నాను. కానీ మొదటి ఆట నుంచే మంచి స్పందన వస్తోంది' అన్నారు.

Updated Date - Mar 19 , 2026 | 08:27 PM