సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Ustaad Bhagat Singh: వేసవిలో ఫస్ట్ బిగ్ మూవీ.. 'ఉస్తాద్ భగత్ సింగ్'

ABN, Publish Date - Jan 24 , 2026 | 05:53 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన 'ఉస్తాద్ భగత్ సింగ్'పై మెల్లగా బజ్ క్రియేట్ అవుతోంది...వేసవిలో ఈ మూవీ జనాన్ని పలకరించడానికి సిద్ధమవుతోన్నట్టు టాక్...

పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన 'ఉస్తాద్ భగత్ సింగ్'పై ఫ్యాన్స్ బోలెడు ఆశలు పెట్టుకున్నారు. అయితే ఈ సినిమా 'తేరీ' తమిళ చిత్రం ఆధారంగా తెరకెక్కిందని ప్రచారం సాగింది. దాంతో అభిమానులు నిరాశ చెందారు. పైగా ఈ చిత్రానికి ముందు చిత్ర దర్శకుడు హరీశ్ శంకర్ 'మిస్టర్ బచ్చన్' లాంటి డిజాస్టర్ తీశాడు. ఆ కారణంగానూ ఫ్యాన్స్ 'ఉస్తాద్ భగత్ సింగ్' ను అంతగా పట్టించుకోలేదు. అయితే ఈ మూవీ ఏ సినిమాకూ రీమేక్ కాదని అంటున్నారు. అలాగే గతంలోనూ ఫ్లాప్స్ చూసిన హరీశ్ శంకర్ కు పవన్ కళ్యాణ్ 'గబ్బర్ సింగ్'తోనే తొలి బ్లాక్ బస్టర్ లభించిందనీ గుర్తు చేసుకుంటున్నారు. ఆ తీరున ఈ సారి కూడా 'ఉస్తాద్ భగత్ సింగ్'తో ఓ బిగ్ హిట్ ను పవన్ కళ్యాణ్ అందుకుంటారనీ అభిమానులు ఆశిస్తున్నారు. అలా మెల్లగా 'ఉస్తాద్ భగత్ సింగ్'కు బజ్ పెరుగుతోంది.


క్లాష్ కాకుండా చూసుకొని...
పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అయిన తరువాత విడుదలైన తొలి చిత్రం 'హరిహర వీరమల్లు'. ఈ సినిమా అభిమానులను ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది... తరువాత వచ్చిన 'ఓజీ' మూవీ ఫ్యాన్స్ లో ఊపు తీసుకు వచ్చింది. భారీ వసూళ్ళు చూసింది. అయితే పవన్ కు బ్లాక్ బస్టర్ హిట్ ను మాత్రం అందించలేకపోయింది. అందువల్ల నిరాశకు గురైన ఫ్యాన్స్ ను 'ఉస్తాద్ భగత్ సింగ్' అలరిస్తుందని ఇన్ సైడ్ టాక్. మరి ఈ మూవీ ఎప్పుడు వెలుగు చూస్తుంది? ఈ ప్రశ్నకే పలు సమాధానాలు వినిపిస్తున్నాయి. పవన్ అన్నయ్య చిరంజీవి 'విశ్వంభర' సినిమా వేసవిలో రిలీజ్ కానుందని అంటున్నారు.. అలాగే మార్చి 27వ తేదీన రామ్ చరణ్ 'పెద్ది' సినిమా జనం ముందుకు రానుంది. అన్నయ్య, అబ్బాయ్ డేట్స్ క్లాష్ కాకుండా చూసుకొని సరైన సమయంలో ప్రేక్షకుల ముందుకు 'ఉస్తాద్ భగత్ సింగ్' వస్తుందని అంటున్నారు...


సమ్మర్ లో 'ఉస్తాద్..' సందడి...!
 
కొద్ది రోజులుగా రామ్ చరణ్ 'పెద్ది' సినిమా మార్చి 27వ తేదీన విడుదల కాదని వినిపిస్తోంది. అందులోని నిజానిజాలేంటో కానీ, పలు రకాలుగా వార్తలు వస్తున్నాయి. మార్చి 27న 'పెద్ది'ని విడుదల చేస్తే అప్పటికే ఓ వారం ముందుగా వచ్చే రణవీర్ సింగ్ 'దురంధర్-2', యశ్ 'టాక్సిక్' చిత్రాల వల్ల దేశవ్యాప్తంగా సరైన థియేటర్స్ లభిస్తాయో లేదో అన్న అనుమానాలు పొడసూపు తున్నాయి... అందువల్లే 'పెద్ది' చిత్రం మరో డేట్ ను వెదుక్కుంటుందని వినిపిస్తోంది... అప్పుడు చిరంజీవి 'విశ్వంభర' సినిమా డేట్ కూడా మారుతుందని అంటున్నారు... ఈ రెండు చిత్రాల రిలీజ్ డేట్స్ ను బట్టే పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' జనం ముందుకు వచ్చే ఏర్పాట్లు సాగుతాయని వినికిడి. 'పెద్ది' మార్చి 27న రాకపోతే, ఆ తేదీకి కానీ, లేదా ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో కానీ 'ఉస్తాద్ భగత్ సింగ్'ను రిలీజ్ చేస్తారని తెలుస్తోంది. మరి ఈ సారి సమ్మర్ లో 'ఉస్తాద్ భగత్ సింగ్' ఏ రేంజ్ లో అలరిస్తారో చూడాలి.

Updated Date - Jan 24 , 2026 | 09:52 PM