సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

భారీగా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌.. ఎక్కడంటే..

ABN, Publish Date - Mar 14 , 2026 | 04:55 PM

విడుదల దగ్గరపడుతున్న కొద్దీ ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ టీమ్‌ ప్రమోషన్స్‌ ముమ్మరం చేస్తోంది.

విడుదల దగ్గరపడుతున్న కొద్దీ ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ (Ustad Bhagat singh) టీమ్‌ ప్రమోషన్స్‌ ముమ్మరం చేస్తోంది. ఇప్పటికే టీజర్‌, మూడు పాటలతో సినిమాపై అంచనాలు పెంచేశారు. ఇప్పుడు ట్రైలర్‌ విడుదలకు సమయం ఆసన్నమైంది. దీనికి సంబంధించి మేకర్స్‌ గుడ్‌ న్యూస్‌ చెప్పారు. శనివారం సాయంత్రం 6.30 గంటలకు ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు. అంతే కాదు ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌ను భారీగా ప్లాన్‌ చేశారు. మార్చి 15న హైదరాబాద్‌ పోలీస్‌ గ్రౌండ్స్‌లో సాయంత్రం 5 గంటల నుంచి ఈ ఈవెంట్‌ మొదలు కానుందని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.

పవన్‌తోపాటు(Pawan Kalyan) 'గబ్బర్‌సింగ్‌' బ్యాచ్‌ ఉన్న పోస్టర్‌ను ఎక్స్‌ వేదికగా ఓ పోస్టర్‌ షేర్‌ చేసింది. దర్శకుడు హరీశ్‌ శంకర్‌ కూడా ఈ విషయాన్ని తెలియజేశారు. ‘ఈసారి ఈవెంట్‌ బద్దలైపోవాలి ఫ్రెండ్స్‌’ అని తన పోస్టులో పేర్కొన్నారు హరీశ్‌. ఇందులో పవన్‌ కల్యాణ్‌ సరసన రాశీఖన్నా, శ్రీలీల కథానాయికలుగా  నటిస్తున్నారు. ఈ నెల 19న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించారు. నేపథ్య సంగీతం కోసం తమన్‌ పని చేస్తున్నారు. సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తయ్యాయి. యు/ఎ సర్టిఫికెట్‌ పొందిందీ చిత్రం.    

Updated Date - Mar 14 , 2026 | 04:55 PM