ఉస్తాద్ భగత్‌సింగ్: ఓటీటీ బిజినెస్ ఎంతో తెలుసా..
ABN, Publish Date - Feb 26 , 2026 | 03:30 PM
పవన్‌కల్యాణ్ (Pawan kalyan) నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ మార్చి 26న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ‘గబ్బర్‌సింగ్’’లాంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత పవన్, హరీశ్ శంకర్ కాంబినేషన్‌లో రాబోతున్న చిత్రం కావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి
పవన్‌కల్యాణ్ (Pawan kalyan) నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ మార్చి 26న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ‘గబ్బర్‌సింగ్’’లాంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత పవన్, హరీశ్ శంకర్ కాంబినేషన్‌లో రాబోతున్న చిత్రం కావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మొదటి పాట రిలీజ్‌లో అంచనాలు రెట్టింపు అయ్యాయి. రెండో పాటకూ మంచి రెస్పాన్స్ వచ్చింది. మార్చి రెండో వారంలో ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు. మరో రెండు పాటలు వదలాల్సి ఉంది. ప్రస్తుతం మేకర్స్ బిజినెస్ క్లోజ్ చేసే పనిలో పడ్డారు. ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. దాదాపు రూ.80 కోట్లకు డీల్ పూర్తయిందని తెలిసింది. (ustaad Bhagat singh ott deal)
పవన్ కల్యాణ్ గత చిత్రం ‘ఓజీ’కూ ఇంచుమించుగా ఇంతే అమౌంట్ ఫైనల్ చేశారు. ఓజీ సినిమా థియేట్రికల్‌గానే కాకుండా ఓటీటీలోనూ మంచి ఆదరణ దక్కించుకుంది. ఆ కారణంగానే ఉస్తాద్ ఓటీటీ డీల్ కూడా ఈజీగా క్లోజ్ అయ్యిందని చెబుతున్నారు. మైత్రీ మూవీస్ మేకర్స్ సంస్థ నిర్మిస్తోన్న చిత్రమిది. సినిమా మీదున్న నమ్మకంతో మైత్రీ సంస్థ ఓన్ రిలీజ్ చేస్తుందని టాక్. కర్ణాటకలో హోంబలే సంస్థ విడుదల చేయనుంది. ఓవర్సీస్ బిజినెస్ కూడా త్వరలో పూర్తికానుందని తెలిసింది.