ఉస్తాద్ భగత్ సింగ్: అభిమానులకు విందు.. మాస్ సినిమాకు కొత్త నిర్వచనం
ABN, Publish Date - Feb 27 , 2026 | 04:52 PM
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కథానాయకుడిగా హరీశ్ శంకర్ (Harish Shankar) దర్శకత్వంలో రూపొందుతోన్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagt singh) చిత్రంపై అంచనాలు భారీస్థాయిలో ఉన్నాయి.
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కథానాయకుడిగా హరీశ్ శంకర్ (Harish Shankar) దర్శకత్వంలో రూపొందుతోన్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagt singh) చిత్రంపై అంచనాలు భారీస్థాయిలో ఉన్నాయి. తాజాగా విడుదల చేసిన కొత్త పోస్టర్ ఆ అంచనాలను రెట్టింపు చేస్తున్నాయి. పవన్ హ్యాట్ ధరించి స్టైలిష్ గా కనిపిస్తున్న పోస్టర్, సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. విడుదలైన క్షణాల్లోనే వైరల్‌గా మారింది. అభిమానులు, సినీ ప్రియులు పవన్ కళ్యాణ్ అద్భుతమైన లుక్ కి ఫిదా అవుతున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా చక్కని ఆదరణ లభిస్తోంది. ‘దేఖ్ లేంగే సాలా’, ‘ఆరా ఆఫ్ ఉస్తాద్’ పాటలు చార్ట్‌బస్టర్‌లుగా నిలిచాయి. అన్ని వర్గాల నుంచి వెల్లువెత్తుతున్న ప్రేమాభిమానాలతో చిత్ర బృందం ఆనందం వ్యక్తం చేస్తోంది. ఈ ఉత్సాహాన్ని మరింత పెంచుతూ, త్వరలోనే చిత్రానికి సంబంధించిన పవర్‌ప్యాక్డ్ 40 సెకన్ల గ్లింప్స్‌ను విడుదల చేయడానికి నిర్మాతలు సిద్ధమవుతున్నారు. దీనితో మాస్ ఎలిమెంట్స్‌ను ప్రేక్షకులకు చూపించనున్నారు. ఈ గ్లింప్స్ అభిమానులకు అసలు సిసలైన మాస్ విందుని అందించనుంది.
'ఉస్తాద్ భగత్ సింగ్’లో పవన్ కళ్యాణ్‌ను మునుపెన్నడూ చూడని మాస్ అవతార్‌లో చూపించడానికి శాయశక్తులా కృషి చేస్తున్నారు దర్శకుడు. అన్ని అంశాల మేళవింపుతో పూర్తి వినోదభరిత చిత్రంగా ఇది రూపుదిద్దుకుంటోంది. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ తన సంగీతంతో చిత్రానికి మరింత హై వోల్టేజ్ ఎనర్జీని అందిస్తున్నారు. అంచనాలు ఆకాశాన్ని తాకుతున్న వేళ, ఉత్సాహం రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో, 'ఉస్తాద్ భగత్ సింగ్' మరోసారి మాస్ సినిమాకు కొత్త నిర్వచనం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది' అని మేకర్స్ చెబుతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.