శ్రీరాఘవేంద్ర స్వామి సన్నిధిలో.. మెగా కోడలు
ABN, Publish Date - Sep 17 , 2026 | 01:48 PM
మంత్రాలయం శ్రీరాఘవేంద్ర స్వామిని నటుడు రామ్ చరణ్ సతీమణి ఉపాసన దర్శించుకున్నారు.
మంత్రాలయం (Mantralayam) శ్రీరాఘవేంద్ర స్వామి (Sri Raghavendra Swamy Temple)ని నటుడు రామ్ చరణ్ సతీమణి ఉపాసన (Upasana Konidela) దర్శించుకున్నారు. ప్రత్యేక హెలికాఫ్టర్‌లో మంత్రాలయం చేరుకున్న ఉపాసన.. మఠం ప్రాకారానికి రాగానే అధికారులు మేళతాళాలతో ఘనస్వాగతం పలికారు.
ముందుగా గ్రామ దేవత మంచాలమ్మ, శ్రీ రాఘవేంద్ర స్వామి వారి మూల బృందావనంకు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం పీఠాధిపతి ఉపాసనకు తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు.