సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

పిల్లల ముద్దు పేర్లతో ఉపాసన పోస్ట్ వైరల్..

ABN, Publish Date - Feb 13 , 2026 | 04:17 PM

రామ్‌చరణ్‌ – ఉపాసన దంపతులు తమ కవల పిల్లలకు కుటుంబ సభ్యుల సమక్షంలో నామకరణం చేశారు.

రామ్‌చరణ్‌ (Ram Charan) – ఉపాసన (Upasana) దంపతులకు ఇటీవల కవల పిల్లలు జన్మించిన విషయం తెలిసిందే. ఇద్దరిలో ఒకరు బాబు, ఒకరు పాప. ఈ నెల 11న కొణిదెల, కామినేని కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో బారసాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు ఇద్దరికీ నామకరణం చేశారు. అబ్బాయికి శివరామ్‌, అమ్మాయికి అన్వీరా దేవి అని పేరు పెట్టినట్లు మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా తెలిపారు. అయితే ఈ  పేర్లు పెట్టడం వెనకున్న కారణం, అర్థాలను రామ్ చరణ్, ఉపాసన ఓ పోస్టులో తెలిపారు. 

'మా కారా.. వీరా.. రామ' అని తాజాగా ఉపాసన చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. 

'మా అబ్బాయి పేరు శివరామ్‌.. శివుడు, రాముడు పేర్లు కలిసేలా పేరు పెట్టాం. శివ అనే పదం తపస్సు, అంతర్గత బలం, నిశ్చలత, ఆధ్యాత్మికను సూచిస్తుంది. రామ్ అనే పదం రాముని ధర్మ తత్వాన్ని ప్రతిబింబిస్తుంది. అలాగే మా  నాన్నగారి అసలు పేరు శివశంకర్‌ వరప్రసాద్‌ ఉండటంతో ‘శివ’ అనే పదం కూడా కలిసేలా చూసుకున్నాం. తెలంగాణలోని దోమకొండ సంస్థానంలో ఉన్న పురాతన శివరామ ఆలయంలో శివుడు, శ్రీరాముడు ఆరాధింపబడుతారు. అది కూడా కారణం' అని  రామ్ చరణ్ తెలిపారు.  

అన్వీరా దేవి అనే పేరు  దుర్గాదేవి తత్వానికి  ప్రతిరూపం. అన్వీరా అంటే భయంలేని, ఆత్మవిశ్వాసం, దైవ రక్షణతో నిండిన వ్యక్తిత్వం అని అర్థం. విజయవాడ కనకదుర్గమ్మ ఆశీసులు కూడా ఈ పేరు పెట్టడానికి కారణం అని  తెలిపారు.  

Updated Date - Feb 13 , 2026 | 04:43 PM