విజయ్- రష్మిక విడాకులు.. మీకేమైనా పిచ్చి పట్టిందారా
ABN, Publish Date - Oct 24 , 2026 | 09:59 PM
కొన్నిసార్లు సోషల్ మీడియా స్ప్రెడ్ చేసే నెగిటివిటీ అంతా ఇంతా కాదు. అసలు నిజమా.. కాదా అనేది ఏమి తెలియకుండానే కొందరు చేసే పోస్టులు చాలా చిరాకు తెప్పిస్తాయి. ముఖ్యంగా సెలబ్రిటీల మీద వారు చేసే కామెంట్స్ మహా దారుణంగా ఉంటాయి.
కొన్నిసార్లు సోషల్ మీడియా స్ప్రెడ్ చేసే నెగిటివిటీ అంతా ఇంతా కాదు. అసలు నిజమా.. కాదా అనేది ఏమి తెలియకుండానే కొందరు చేసే పోస్టులు చాలా చిరాకు తెప్పిస్తాయి. ముఖ్యంగా సెలబ్రిటీల మీద వారు చేసే కామెంట్స్ మహా దారుణంగా ఉంటాయి. తాజాగా ఇలాంటి దారుణమైన ట్రోలింగ్ నే ఎదుర్కొంటున్నారు కొత్త జంట విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)- రష్మిక మందన్న (Rashmika Mandanna). ఈ సోషల్ మీడియా వలన ఈ జంట ఎంతో మానసిక క్షోభని అనుభవిస్తున్నారు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఏ ముహూర్తన ఈ జంట కాఫీ విత్ కరణ్ షోలో అడుగుపెట్టారో.. అప్పటి నుంచి ఈ ట్రోలింగ్ మొదలయ్యింది.
అసలేమయ్యింది అంటే.. పెళ్లి తరువాత విజయ్ - రష్మిక నటించిన రణబాలి రిలీజ్ అయ్యి ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈ జంట కరణ్ జోహార్ హోస్ట్ చేస్తోన్న కాఫీ విత్ కరణ్ షోలో సందడి చేశారు. ఈ షో .. సినిమాల గురించి ఒక్క మాట కూడా కరణ్ మాట్లాడడు. అది తెలిసి కూడా ఈ జంట వెళ్ళడం వారు చేసిన తప్పు. పెళ్లికి ముందు ఎవరు ప్రపోజ్ చేశారు అని కరణ్ అడగడం .. దానికి విజయ్ యాటిట్యూడ్ చూపిస్తూ.. రష్మిక వందసార్లు నన్ను పెళ్లి చేసుకోమని బతిమలాడింది అని చెప్పడం ఒక ఎత్తు అయితే.. ఏడాది పొడుగునా అడిగి పెళ్లి చేసుకున్నా అని రష్మిక చెప్పడం మరో ఎత్తు. ఇక అక్కడి నుంచి విజయ్ రెడ్ ఫ్లాగ్ అంటూ ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.
అంతేనా.. వీరిద్దరి మధ్య దూరం పెంచే ప్రశ్నలు చాలానే వచ్చాయి. ఓరీ బాబో ఇదెక్కడి ఇంటర్వ్యూరా అని అందరూ నోళ్లు వెళ్లబెట్టారు. ఇక ఇదంతా అయిపోతుంది అనుకొనేలోపు విజయ్.. రష్మికని ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వడం లేదని కొత్త రచ్చ మొదలయ్యింది. ఈమధ్య సెలబ్రిటీలు విడాకులు అయ్యాయి అని డైరెక్ట్ గా చెప్పకుండా ఇన్స్టాగ్రామ్ లో ఒకరినొకరు అన్ ఫాలో చేసుకుంటున్నారు. ఇక ఇప్పుడు ఈ జంట కూడా అదే చేశారు అని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. కొందరు అయితే వీరిద్దరూ విడాకులు కూడా తీసుకుంటున్నారు అని చెప్పుకొస్తున్నారు.
ఇక ఈ విషయం విన్న వీరి ఫ్యాన్స్ .. మీకేమైనా పిచ్చి పట్టిందా.. విజయ్- రష్మికకి పెళ్లి అయ్యి ఏడాది కూడా కాలేదు. ఎవరు ఎవరికి ప్రపోజ్ చేసినా.. చివరికి ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. వారి లైఫ్ వారు లీడ్ చేస్తున్నారు. విజయ్ రెడ్ ఫ్లాగ్.. రష్మిక కి విజయ్ అవసరమా.. ఇలా ఎన్ని పోస్టులు పెట్టినా కూడా వారిద్దరూ విడిపోయే ప్రసక్తే లేదని మరికొందరు చెప్పుకొస్తున్నారు. ఇలా వేరేవాళ్ల కాపురాల్లో చిచ్చు పెట్టకపోతే మీ పని మీరు చూసుకోండి అని కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ విడాకుల గొడవపై ఈ జంట ఏమైనా స్పందిస్తారా.. లేదా.. అనేది చూడాలి.