మంగ అందం చూసి ఉక్కిరిబిక్కిరి అవుతున్న శ్రీనివాస్
ABN, Publish Date - Jul 27 , 2026 | 08:42 PM
ఆర్ఎక్స్ 100, మంగళవారం వంటి సన్సేషనల్ చిత్రాలతో తనదైన గుర్తింపు తెచ్చుకున్న వైవిధ్యమైన దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ శ్రీనివాస మంగాపురం (Srinivasa Mangapuram).
ఆర్ఎక్స్ 100, మంగళవారం వంటి సన్సేషనల్ చిత్రాలతో తనదైన గుర్తింపు తెచ్చుకున్న వైవిధ్యమైన దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ శ్రీనివాస మంగాపురం (Srinivasa Mangapuram). ఘట్టమనేని వారసుడు జయ కృష్ణ (Jayakrishna), బాలీవుడ్ బ్యూటీ రాషా తడాని జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో మోహన్ బాబు విలన్ గా నటిస్తున్నాడు. స్టార్ ప్రొడ్యూసర్ సి. అశ్విని దత్ సమర్పణలో, పి. కిరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. జులై 30 న శ్రీనివాస మంగాపురం రిలీజ్ కు సిద్ధమయ్యింది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్ స్పీడు పెంచిన మేకర్స్ తాజాగా ఉక్కిరి బిక్కిరి అనే రొమాంటిక్ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు.
సాంగ్ ఆద్యంతం ఆకట్టుకుంటుంద. జి.వి. ప్రకాష్ కుమార్ స్వరాలు సమకూర్చిన ఈ పాట వినగానే ఆకట్టుకునేలా మంచి బీట్ అండ్ మెలోడీతో రూపుదిద్దుకుంది. పాటలో జయకృష్ణ, రాషా తడానిల కెమిస్ట్రీ నెక్స్ట్ లెవెల్ ఉంది. ముఖ్యంగా రాషా అందం హైలైట్ అని చెప్పొచ్చు. విజువల్స్ అయితే అదిరిపోయాయి. థియేటర్ లో ఈ సాంగ్ కు విజిల్స్ పడడం ఖాయమనిపిస్తుంది. చంద్రబోస్ అందించిన లిరిక్స్ ఒక ఎత్తు అయితే.. హరి చరణ్ వాయిస్ మరో ఎత్తు అని చెప్పొచ్చు. మంగ అందానికి ఫిదా అయిన శ్రీనివాస్ తన మనసులోని భావాలను తెలియజేస్తున్నట్లు లిరిక్స్ ని బట్టి అర్దమవుతోంది.
అజయ్ భూపతి మార్క్ మేకింగ్, ప్రొడక్షన్ వేల్యూస్, జి.వి. ప్రకాష్ అందించిన క్యాచీ మ్యూజిక్ తోడవ్వడంతో ఈ పాట సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. సినిమాపై ఉన్న ఆసక్తిని ఈ పాట మరింత రెట్టింపు చేసిందని, యూత్‌కి ఈ సాంగ్ పర్ఫెక్ట్ ఛార్ట్‌బస్టర్‌గా నిలుస్తుందని నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు. మరి ఘట్టమనేని వారసుడు మొదటి సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.