Ravi Teja: రవితేజ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఫిక్స్?

ABN , Publish Date - Sep 01 , 2026 | 11:55 AM

‘ఇరుముడి’తో సాలిడ్ బ్లాక్‌బస్టర్ అందుకున్నారు  మాస్ మహారాజా రవితేజ.  ఫుల్ జోష్ లో ఉన్న ఆయన  అంతే జోష్ తో  తదుపరి ప్రాజెక్ట్‌పై ఫోకస్ పెట్టారు. ‘

‘ఇరుముడి’తో సాలిడ్ బ్లాక్‌బస్టర్ అందుకున్నారు మాస్ మహారాజా రవితేజ (Ravi teja).  ఫుల్ జోష్ లో ఉన్న ఆయన  అంతే జోష్ తో  తదుపరి ప్రాజెక్ట్‌పై ఫోకస్ పెట్టారు. ‘రాజ రాజ చోర’, ‘స్వాగ్’ చిత్రాలతో తనదైన మార్క్ కామెడీ, ఎంటర్‌టైనింగ్ టేకింగ్‌తో ఆకట్టుకున్న దర్శకుడు హసిత్ గోలితో (Hasith Goli) రవితేజ జతకడుతున్న విషయం తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ  సంబంధించి ఓ వార్త వైరల్ అవుతోంది. ఇందులో ఇద్దరు హీరోయిన్లు నటించనున్నట్లు సమాచారం. రవితేజకు జోడీగా టాలెంటెడ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ నటించనున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. సెప్టెంబర్ నుంచి ఆమె షూటింగ్‌లో పాల్గొననున్నట్లు సమాచారం. ఈ సినిమాలో నటుడు శ్రీవిష్ణు కూడా ఉన్నారు. ఆయనకు జోడీగా  ఆయనకు జోడీగా మాళవికా మోహనన్‌ను రెండో హీరోయిన్‌గా ఎంపిక చేసినట్లు ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. 

నాలుగున్నర నెలల్లో షూటింగ్ పూర్తి!

ఈ క్రేజీ ప్రాజెక్ట్ షూటింగ్‌ను సెప్టెంబర్‌లో ప్రారంభించి కేవలం నాలుగున్నర నెలల్లోనే పూర్తి చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అన్నీ అనుకున్నట్లు జరిగితే పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా పూర్తి చేసి 2027 సంక్రాంతి కానుకగా జనవరి 14న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. రవితేజ మాస్ ఇమేజ్‌కు హసిత్ గోలి ఎంటర్‌టైనింగ్ టేకింగ్ తోడవడంతో ఈ కాంబినేషన్‌పై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. దీనికి తోడు శ్రీవిష్ణు, ఐశ్వర్య రాజేష్, మాళవికా మోహనన్ వంటి నటీనటులు భాగం కావడంతో సినిమాపై ఆసక్తి మరింత పెరుగుతోంది. ఇతర నటీనటుల వివరాలు,  త్వరలో వెల్లడిస్తారు.  

Updated Date - Sep 01 , 2026 | 12:02 PM