హన్సికా ప్రైవేట్ వీడియో లీక్..
ABN, Publish Date - Oct 30 , 2026 | 12:34 PM
ఏఐ టెక్నాలజీ వచ్చాక ఏ వీడియో నిజమో.. ఏ వీడియో అబద్ధమో తెలియకుండా పోయింది. ముఖ్యంగాఈ వీడియోల వలన హీరోయిన్స్ చాలా ఇబ్బందులు పడుతున్నారు.
ఏఐ టెక్నాలజీ వచ్చాక ఏ వీడియో నిజమో.. ఏ వీడియో అబద్ధమో తెలియకుండా పోయింది. ముఖ్యంగాఈ వీడియోల వలన హీరోయిన్స్ చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎవరిదో వీడియోకి హీరోయిన్ల ముఖాలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వ్యూస్ కోసం పోస్ట్ చేస్తున్నారు. ఇప్పటికే చాలామంది హీరోయిన్స్ ఇలా డీప్ ఫేక్ వీడియోల బారిన పడ్డారు. ఇప్పుడు ఆ లిస్ట్ లో హన్సిక మోత్వాని (Hansika Motwani) కూడా చేరింది. దక్షిణాది చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి హన్సికా పేరుతో గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఒక తీవ్రమైన వివాదం నడుస్తోంది. రెడ్డిట్, ఎక్స్ వేదికగా హన్సికాకు సంబంధించిన ఒక ప్రైవేట్ లేదా పర్సనల్ వీడియో లీక్ అయిందంటూ కొన్ని పుకార్లు వైరల్ అయ్యాయి. దీనికి తోడు పలువురు నెటిజన్లు మీమ్స్, షాకింగ్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఉన్న ఫోటోలను జత చేస్తూ పోస్టులు పెట్టడంతో ఈ విషయం కాస్తా ఇంటర్నెట్లో విపరీతంగా చర్చనీయాంశంగా మారింది.
అయితే ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది. ఈ వైరల్ వీడియో క్లెయిమ్స్‌కు ఎలాంటి బలమైన ఆధారం లేదా ఆధారపూర్వక ఆధారాలు లేవు. కొంతమంది నెటిజన్లు ఇది కేవలం డీప్‌ఫేక్ లేదా మార్ఫింగ్ చేసిన కంటెంట్ అని స్పష్టం చేస్తుండగా, మరికొందరు ఎలాంటి ఆధారాలు లేకుండా వచ్చే వార్తలను నమ్మవద్దని సూచిస్తున్నారు. గతంలో కూడా హన్సికా సంబంధించి ఇలాంటి ఫేక్, మార్ఫింగ్ వివాదాలు రావడం, ఆ తర్వాత అవన్నీ తప్పుడు వార్తలని తేలడం తెలిసిందే.
ఇక హన్సికా ప్రస్తుతం సింగిల్ గా ఉంటుంది. 2022 లో సొహైల్ కతురియా అనే బిజినెస్ మ్యాన్ ని ఈ చిన్నది ప్రేమించి పెళ్లి చేసుకుంది. అతను మరెవరో కాదు హన్సికా బెస్ట్ ఫ్రెండ్ భర్త. వీరి వివాహం చాలా గ్రాండ్ గా జరగడమే కాకుండా జియో హాట్ స్టార్ లో డాక్యుమెంటరీగా కూడా స్ట్రీమింగ్ అయ్యింది. నాలుగేళ్ళు కలిసి ఉన్న ఈ జంట కొన్ని విభేదాల వలన 2026 లో విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం హన్సికా చేతిలో సరైన సినిమాలు కూడా లేవు. మరి ఈ డీప్ ఫేక్ వీడియో పై హన్సికా ఏమైనా స్పందిస్తుందేమో చూడాలి.