రూ. 100 కోట్ల బ్లాక్‌బస్టర్ 'హనుమాన్ అంశ్'.. ఇప్పుడు తెలుగులో
ABN, Publish Date - Sep 11 , 2026 | 06:29 PM
ఇండస్ట్రీలో ఇప్పుడు కంటెంట్ అనేది చాలా ముఖ్యం. పెద్ద స్టార్స్, భారీ బడ్జెట్.. స్టార్ మేకర్స్.. ఇలా అన్నీ ఉన్నా కూడా కథ లేకపోతే ఆ సినిమాను నిర్మొహమాటంగా పక్కన పెట్టేస్తున్నారు ప్రేక్షకులు.
ఇండస్ట్రీలో ఇప్పుడు కంటెంట్ అనేది చాలా ముఖ్యం. పెద్ద స్టార్స్, భారీ బడ్జెట్.. స్టార్ మేకర్స్.. ఇలా అన్నీ ఉన్నా కూడా కథ లేకపోతే ఆ సినిమాను నిర్మొహమాటంగా పక్కన పెట్టేస్తున్నారు ప్రేక్షకులు. కథ ఉంటే చిన్న సినిమాను అయినా నెత్తిన పెట్టుకుంటున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో చిన్న సినిమాల హవానే నడుస్తోంది. అందుకు నిదర్శనం.. హనుమాన్ అంశ్ (Hanuman Ansh) చిత్రమే. చిన్న సినిమాగా విడుదలై, బాక్సాఫీస్ వద్ద రూ. 150 కోట్లకు పైగా వసూళ్లతో ఊహించని సంచలనం సృష్టించి.. అందరిని ఆశ్చర్యపరిచింది. ఆధ్యాత్మిక గురువు నీమ్ కరోలి బాబా జీవిత విశేషాలు, ఆయన మహిమల ఆధారంగా దర్శకుడు విశాల్ చతుర్వేది తెరకెక్కించిన ఈ డివైన్ బ్లాక్‌బస్టర్ హిందీలో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. తాజాగా ఈ భక్తి చిత్రం తెలుగులో కూడా రాబోతుంది.
హనుమాన్ అంశ్ సినిమాలో శోభిత్ శ్రీవాత్సవ, చందన్ ఆనంద్, పూర్ణిమ తివారి, విహాన్ షెగ్డే కీలక పాత్రల్లో నటించారు. గత నెల 7వ తేదీన బాలీవుడ్ లో రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 150 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. తెలుగులో ఈ ప్రతిష్టాత్మక డివైన్ జర్నీ చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ సమర్పిస్తుండటం విశేషం. ప్రముఖ నిర్మాణ సంస్థ ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో అత్యంత వైభవంగా విడుదల చేస్తున్నారు. కేవలం రూ. 2 కోట్ల బడ్జెట్‌తో రూపుదిద్దుకుని ఏకంగా పెద్ద సినిమాల రికార్డులను తిరగరాసిన ఈ హిందీ సెన్సేషన్‌ను తెలుగులోకి గ్రాండ్‌గా డబ్ చేసి తీసుకువస్తున్నారు. టాలీవుడ్‌లో ఆధ్యాత్మిక చిత్రాలకు లభించే ఆదరణను దృష్టిలో ఉంచుకుని, ఈ డబ్బింగ్ పనులను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ పర్యవేక్షణలో అత్యున్నత ప్రమాణాలతో సిద్ధం చేయనున్నాడు.
దేశవ్యాప్తంగా అద్భుతమైన ఆదరణ దక్కించుకున్న ఈ పవర్‌ఫుల్ డివైన్ జర్నీ మూవీ సెప్టెంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఉత్తరాది బాక్సాఫీస్‌ను షేక్ చేసిన నీమ్ కరోలి బాబా డివైన్ స్టోరీ, త్రివిక్రమ్ శ్రీనివాస్ సపోర్ట్‌తో తెలుగులో కూడా అదే స్థాయిలో సంచలన వసూళ్లను సాధిస్తుందని చిత్రబృందం ధీమా వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే ఇరుముడితో థియేటర్స్ అన్నీ గుడులుగా మారాయి. ఇక మరోసారి హనుమాన్ అంశ్ తో థియేటర్లు ఆలయాలుగా మారిపోతాయి అని చెప్పడంలో ఆశ్చర్యం లేదు. ఇలాంటి మంచి చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించి.. గురూజీ మంచి పని చేస్తున్నాడు. దీంతోపాటు తన సినిమా ఆదర్శ కుటుంబం ప్రమోషన్స్ కూడా కానిచ్చేస్తున్నాడు. ఒక దెబ్బకు రెండుపిట్టలు అన్నట్లు గురూజీ మంచి ప్లాన్ వేసినట్లు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.