Jayammu Nischayammu Raa: గురూజీతో జగ్గూభాయ్ కబుర్లు.. సునీల్ ట్విస్ట్ అదిరింది
ABN, Publish Date - Oct 19 , 2026 | 12:58 PM
జీ తెలుగు వేదికగా ప్రసారమవుతున్న పాపులర్ టాక్ షో జయమ్ము నిశ్చయమ్ము రా సీజన్ 2 (Jayammu Nischayammu Raa) ప్రస్తుతం టాలీవుడ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
జీ తెలుగు వేదికగా ప్రసారమవుతున్న పాపులర్ టాక్ షో జయమ్ము నిశ్చయమ్ము రా సీజన్ 2 (Jayammu Nischayammu Raa) ప్రస్తుతం టాలీవుడ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. జగపతి బాబు హోస్ట్ చేస్తున్న ఈ షో సెకండ్ సీజన్ లో మొదటి గెస్ట్ గా సాయిపల్లవి వచ్చి అందరినీ షాక్ కి గురిచేసింది. ఇక ఇప్పుడు సెకండ్ ఎపిసోడ్ లో మాటల మాంత్రికుడు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) సందడి చేశాడు. తాజాగా ఈ షోకి సంబంధించిన లేటెస్ట్ ప్రోమోని మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ ఎపిసోడ్ లో త్రివిక్రమ్ బెస్ట్ ఫ్రెండ్ సునీల్ రావడం షాకింగ్ ట్విస్ట్. వీరితో పాటు సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్. థమన్ (SS Thaman) స్పెషల్ గెస్ట్‌గా విచ్చేసి చేసిన సందడి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
సినిమాల్లో తనదైన మాటలతో, అద్భుతమైన సంభాషణలతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసే త్రివిక్రమ్, ఈ టాక్ షోలో మాత్రం చాలా రిలాక్స్డ్ మోడ్‌లో కనిపించాడు. తన జీవిత ప్రయాణం, సినిమాల నేపథ్యం, స్నేహం గురించి ఎంతో అద్బుతంగా మాట్లాడాడు. ఇక మధ్యలో సునీల్ రావడంతో ఆశ్చర్యపోయిన గురూజీ.. వారి కెరీర్ మొదట్లో జరిగిన సంఘటనలను గుర్తు చేసుకున్నారు. మరోవైపు, మ్యూజిక్ డైరెక్టర్ థమన్ తనదైన ఎనర్జిటిక్ పంచ్‌లతో, సరదా కౌంటర్లతో షోలో నవ్వులు పూయించారు. హోస్ట్ జగపతి బాబుతో కలిసి వీరిద్దరూ చేసిన అల్లరి ఈ ఎపిసోడ్‌పై అంచనాలను తారాస్థాయికి చేర్చింది.
తెలుగు తెరపై ఎప్పుడూ సీరియస్‌గా లేదా ప్రొఫెషనల్‌గా కనిపించే ఈ దిగ్గజాలు, ఈ షోలో పూర్తిగా అన్ఫిల్టర్డ్ స్టైల్లో తమ వ్యక్తిగత అనుభవాలను పంచుకోవడం విశేషం. పూర్తి ఎంటర్టైన్మెంట్, ఎమోషన్స్, ఆసక్తికరమైన విషయాలతో కూడిన ఈ ఫుల్ ఎపిసోడ్ వీకెండ్లో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచడం ఖాయమని నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఆదర్శ కుటుంబం సినిమా త్వరలోనే రిలీజ్ కానుంది. మరి ఈ సినిమాతో త్రివిక్రమ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.