సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

ఏం జరుగుతోందిరా.. శ్రీనిధి కాళ్లు మొక్కిన త్రివిక్రమ్

ABN, Publish Date - Oct 27 , 2026 | 10:01 PM

టాలీవుడ్‌లో మోస్ట్ అవేటెడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఆదర్శ కుటుంబం (Aadarsha Kutumbam) మరో మూడు రోజుల్లో రిలీజ్ కి సిద్ధమవుతోంది. వెంకటేష్ (Venkatesh), శ్రీనిధి శెట్టి జంటగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ (Trivikram) దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎన్నో వాయిదాల తరువాత ఎట్టకేలకు అక్టోబర్ 30 న రిలీజ్ కాబోతుంది.

Aadarsha Kutumbam

టాలీవుడ్‌లో మోస్ట్ అవేటెడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఆదర్శ కుటుంబం (Aadarsha Kutumbam) మరో మూడు రోజుల్లో రిలీజ్ కి సిద్ధమవుతోంది. వెంకటేష్ (Venkatesh), శ్రీనిధి శెట్టి జంటగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ (Trivikram) దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎన్నో వాయిదాల తరువాత ఎట్టకేలకు అక్టోబర్ 30 న రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్ స్పీడు పెంచిన మేకర్స్ తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకకు హీరోయిన్ శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పింక్ కలర్ శారీలో ట్రెడిషనల్ అండ్ బ్యూటిఫుల్ లుక్‌లో విచ్చేసిన శ్రీనిధి ఎంట్రీ ఈవెంట్‌కే హైలైట్‌గా మారింది.


అంతేకాకుండా ఈవెంట్ లోకి అడుగుపెట్టగానే శ్రీనిధి అందరి పెద్దలకు నమస్కారం చేస్తూ వస్తూ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాళ్లకుగౌరవంతో పాదాభివందనం చేయడానికి ప్రయత్నించింది. అయితే ఊహించని విధంగా త్రివిక్రమ్ కూడా వెంటనే తిరిగి శ్రీనిధి శెట్టి పాదాలకు నమస్కరించడానికి ప్రయత్నించడంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఈ హఠాత్ పరిణామాన్ని చూసిన సీనియర్ యాంకర్ సుమా కనకాల ఏంటిది.. అక్కడ ఏం జరుగుతోంది? అని సరదాగా అనడంతో ఆడిటోరియంలోని అభిమానులంతా ఈలలు, కేకలతో అరిచి గోల చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


అయితే, ఈ ఘటనపై నెటిజన్ల నుంచి భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇది కేవలం పరస్పర గౌరవంతో సరదాగా చేసిన పనే అయినప్పటికీ, గురూజీ అని ఎంతోమంది అభిమానించే ఒక సీనియర్ రచయిత-దర్శకుడు, తనకంటే వయసులో, అనుభవంలో చాలా చిన్నదైన హీరోయిన్ పాదాలను తాకడానికి ప్రయత్నించడం సరైన పద్ధతి కాదని కొంతమంది నెటిజన్లు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మరి గుంటూరు కారం తరువాత చాలా గ్యాప్ తీసుకొని దర్శకత్వ భాద్యతలు చేపట్టిన త్రివిక్రమ్ కి ఆదర్శ కుటుంబం ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.

Updated Date - Oct 27 , 2026 | 10:05 PM