సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

ఆ అమ్మాయికి నా మీద గౌరవం లేదు.. త్రివిక్రమ్ షాకింగ్ కామెంట్స్

ABN, Publish Date - Sep 27 , 2026 | 09:12 PM

విక్టరీ వెంకటేష్, శ్రీనిధి శెట్టి జంటగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఆదర్శ కుటుంబం. అక్టోబర్ 9 న రిలీజ్ కాబోతున్న ఈ చిత్రం నుంచి నారాయణమ్మ పాటను మేకర్స్ రిలీజ్ చేశారు.

(Aadarsha Kutumbam

విక్టరీ వెంకటేష్ (Venkatesh), శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) జంటగా త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఆదర్శ కుటుంబం (Aadarsha Kutumbam). అక్టోబర్ 9 న రిలీజ్ కాబోతున్న ఈ చిత్రం నుంచి నారాయణమ్మ పాటను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్ లో త్రివిక్రమ్ కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఇది సంగీతానికి సంబంధించిన కార్యక్రమమని, అందుకే ఎక్కువ మాట్లాడకుండా చిత్ర మ్యూజిక్ టీమ్‌కు, నటీనటులకు శుభాకాంక్షలు తెలిపాడు. ముఖ్యంగా నటి డింపుల్ హయాతికి ఒంట్లో బాగోలేకపోయినా, షూటింగ్ సమయానికి వచ్చి ఎంతో కష్టపడి ఈ పాటలో నటించినందుకు ఆమెకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశాడు.


'అందరికంటే ముందుగా నేను థాంక్స్ చెప్పాల్సింది డింపుల్ గారికి. ఎందుకంటే తను యాక్చువల్ గా ఒంట్లో బాగాలేదు ఆ టైం కి మేము షూట్ చేసే టైం కి. బట్ మేము చాలా ప్రెషర్ చేశాం మా డేట్స్ కోసం. తను చాలా ఇష్టపడి, కష్టపడి పని చేసింది. సో థాంక్యూ.. థాంక్యూ డింపుల్. సో ఇట్లా ఈ పాటలో కాకుండా కొంచెం సినిమాలో త్వరలో కలవాలని కోరుకుంటున్నాను. ఇంకా శ్రీనిధి, నివేతా.. వీళ్ళందరినీ ఎందుకు గారు అనట్లేదంటే నాకంటే కొంచెం బాగా వయసులో చిన్నవాళ్ళు కాబట్టి. అండ్ శ్రీనిధికి ఎలాగో మా అందరి మీద గౌరవం లేదు, అది మాకు మొదటి నుంచి తెలుసు' అని చెప్పుకొచ్చాడు.


తనకు వెంకటేష్ గారిపై ఉన్న అభిమానాన్ని, అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో తాను మొదటిసారి పెన్ను పెట్టి రాసిన డైలాగ్స్ వెంకటేష్ గారి పవిత్ర బంధం సినిమాకేనని, అలా తన సినీ ప్రయాణం ఆయనతోనే ప్రారంభమైందని చెప్పారు. ఆ తర్వాత నువ్వు నాకు నచ్చావ్ సమయం నుంచి ఇప్పటివరకు వెంకటేష్ గారి పట్ల తనకు ఎంతో గౌరవం, అభిమానంతో కూడిన భయం ఉన్నాయని తెలిపాడు. 76 సినిమాలు పూర్తి చేసినా ఇప్పటికీ సినిమా పట్ల వెంకటేష్ గారికి ఉన్న శ్రద్ధ, సమయపాలన స్ఫూర్తిదాయకమని కొనియాడాడు.


సంగీత దర్శకుడు థమన్, పాటల రచయిత రామజోగయ్య శాస్త్రిలతో తనకున్న సుదీర్ఘ బంధాన్ని ప్రస్తావిస్తూ, వారికి తన అభినందనలు తెలిపారు. అలాగే యండమూరి వీరేంద్రనాథ్ నవలలోని ఒక ప్రసిద్ధ వాక్యాన్ని ఉదాహరణగా చెప్తూ.. వయసు ఏమాత్రం ప్రభావం చూపించని కొద్దిమంది వ్యక్తుల్లో వెంకటేష్ గారు ఒకరు అని వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం త్రివిక్రమ్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Updated Date - Sep 27 , 2026 | 09:12 PM