సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

షూటింగ్‌లో విషాదం.. స‌ముద్రంలో మునిగి స్టార్ హీరో మృతి

ABN, Publish Date - Mar 30 , 2026 | 01:25 PM

బెంగాల్ చిత్ర ప‌రిశ్ర‌మ‌లో తీవ్ర విషాదం నెల‌కొంది. త‌న‌దైన మార్క్ సినిమాలు, టెలీ సీరియ‌ల్స్‌తో అతి త‌క్కువ స‌మ‌యంలోనే స్టార్ స్టేట‌స్ తెచ్చుకున్న న‌టుడు రాహుల్ అరుణోదయ్ బెనర్జీ అకాల మ‌ర‌ణం చెందారు.

Rahul Arunoday

బెంగాల్ చిత్ర ప‌రిశ్ర‌మ‌లో తీవ్ర విషాదం నెల‌కొంది. త‌న‌దైన మార్క్ సినిమాలు, టెలీ సీరియ‌ల్స్‌తో అతి త‌క్కువ స‌మ‌యంలోనే స్టార్ స్టేట‌స్ తెచ్చుకున్న న‌టుడు రాహుల్ అరుణోదయ్ బెనర్జీ (Rahul Arunoday Banerjee) అకాల మ‌ర‌ణం చెందారు. ఈ ఘ‌ట‌న బెంగాలీ సినీ ప‌రిశ్ర‌మ‌ను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ప్ర‌స్తుతం ఈ న్యూస్ సామాజిక మాధ్య‌మాల్లో బాగా వైర‌ల్ అవుతోంది. రాహుల్ మృతిపై ప‌శ్చిమ బెంగాల్ (West Bengal) ప్ర‌భుత్వం, సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.

వివ‌రాల్లోకి వెళితే.. బోలే బాబా పార్ క‌రేగా (Bhole Baba Par Karega) అనే టెలీ ఫిలిం షూటింగ్ నిమిత్తం రాహుల్ త‌న యూనిట్‌, ఫ్యామిలీ మెంబ‌ర్స్‌తో క‌లిసి ఒడిశాలోని తలసరి బీచ్‌కు వెళ్లారు. అక్కడ సముద్రం నేపథ్యంలో ఒక పడవ సీన్‌ చిత్రీకరిస్తున్న సమయంలో రాహుల్ ప్రమాదవశాత్తూ నియంత్రణ కోల్పోయి నీటిలో పడిపోయారు. చిత్ర బృందం వెంట‌నే రియాక్ట్ అయి రాహుల్‌ను ర‌క్షించి హుటాహుటిన ఆస్ప‌త్రికి త‌ర‌లించింది. కానీ అప్ప‌టికే రాహుల్ ప్రాణాలు కోల్పోయిన‌ట్లు వైద్యులు ధృవీక‌రించారు.

స‌మాచారం అందుకున్న బాలాసోర్, పశ్చిమ బెంగాల్ పోలీసులు ప్ర‌మాదానికి సంబంధించిన పూర్తి వివ‌రాలు సేక‌రిస్తూ విచార‌ణ చేప‌డుతున్నారు. కెరీర్ పీక్ స్టేజ్ లో ఉండ‌గా స‌డ‌న్‌గా రాహుల్ ఇలా క‌న్నుమూయ‌డంపై బెంగాల్ మూవీ ఇండ‌స్ట్రీ, అభిమానులు తీవ్ర శోకంలో మునిగిపోయారు. కోల్‌క‌తాలో జ‌న్మించిన రాహుల్‌కు చిన్ననాటి నుంచే న‌ట‌న‌పై ఆస‌క్తి ఎక్కువ. 2008లో రిలీజ్ అయిన‌ ‘చిరోదిని తుమీ జే అమర్’ చిత్రం ఇండ‌స్ట్రీ హిట్‌గా నిల‌వ‌డంతో ఓవ‌ర్‌నైట్ స్టార్ అయిపోయారు. అప్పట్లో బెంగాల్ అంతా ఆయ‌న పేరు మారు మ్రోగిపోయింది.

ఆపై ‘లవ్ సర్కస్’, ‘షోనో మాన్ బోలీ తొమయ్’, ‘నా హన్యతే’ వంటి వరుస సినిమాలతో నటుడిగా టాప్ హీరోల్లో ఒక‌డిగా స్థిర ప‌డ్డాడు. అంతేగాక ‘తుమీ అస్బే బోలే’, ‘దేశెర్ మటి’ వంటి సీరియల్స్‌తో ఆ రాష్ట్ర ప్ర‌జ‌లంద‌రికీ చేరువ‌య్యారు. త‌న తొలి సినిమా నాయిక ప్రియాంక సర్కార్‌ను 2010లో రాహుల్‌ వివాహం చేసుకోగా వారికి ఓ కుమారుడు ఉన్నాడు. 2017లో మ‌న‌స్ప‌ర్థ‌ల‌తో విడిపోయినా, కుమారుడి కోసం రెండేళ్ళ క్రితం తిరిగి క‌లిసిపోయారు. కానీ క‌లిసిన రెండేళ్ళకే ఈ దుర్ఘ‌ట‌న జ‌ర‌గ‌డం, అకాల మ‌ర‌ణం చెందడంతో కుటుంబ స‌భ్యులు జీర్జించుకోలేక పోతున్నారు.

Updated Date - Mar 30 , 2026 | 01:32 PM