సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

‘పళ్లిచట్టంబి’.. హీరోహీరోయిన్లు ఏం చెబుతున్నారంటే..

ABN, Publish Date - Apr 01 , 2026 | 07:23 PM

టొవినో థామస్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘పళ్లిచట్టంబి’. డిజో జోస్‌ ఆంటోనీ దర్శకత్వంలో నౌఫల్‌, బ్రిజీష్‌, చాణక్య చైతన్య చరణ్‌ నిర్మిస్తున్నారు.

టొవినో థామస్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘పళ్లిచట్టంబి’. డిజో జోస్‌ ఆంటోనీ దర్శకత్వంలో నౌఫల్‌, బ్రిజీష్‌, చాణక్య చైతన్య చరణ్‌ నిర్మిస్తున్నారు. కయదు లోహర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ నెల 10న హిందీ, తమిళ, తెలుగు, మ?యాళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా టొవినో థామస్‌, హీరోయిన్‌ కయదు లోహర్‌ విలేకర్లతో మాట్లాడారు.

డిజో ‘పళ్లిచట్టంబి’ కథ చెప్పినప్పుడు చాలా ఎగ్జైటింగ్‌గా అనిపించింది. ఈ సినిమా చేయాలని ఫిక్స్‌ అయ్యాం. సినిమా ప్రారంభించాం. మధ్యలో నిర్మాత డ్రాప్‌ అయ్యారు కొత్త నిర్మాతలు టేకప్‌ చేశారు. ఈ కథ ప్రకారం హీరో బలంగా కనిపించాలి. విలన్స్‌ను విసిరిపారేసేలా ఉండాలి. అందుకే వెయిట్‌ పెరిగాను. లుక్‌ మార్చాను.

ఎమోషనల్‌ మూవీ..

పళ్లిచట్టంబి 50వ దశకంలో కేరళలో జరిగిన ఓ ఘటన స్ఫూర్తితో తెరకెక్కింది. ఫిక్షనల్‌గా సాగుతుంది. అప్పడు సామాజికంగా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో వాటినే మూవీలో చూపించాం. మానవత్వం ముఖ్యమనే పాయింట్‌ను ఇందులో చెబుతున్నాం. పళ్లిచట్టంబి బ్యూటిఫుల్‌ ఎమోషనల్‌ మూవీ. కుటుంబ సమేతంగా చూడొచ్చు. ఇందులో మతాల గురించి ప్రస్తావన, ఏ మతాన్ని తక్కువ చేయడం కానీ చూపించలేదు. సోషియో పొలిటికల్‌ అంశాలు ప్రధానంగా ఉంటాయి.

బయటివారిలా అన్నీ గమనిస్తా..

నాకు ట్రావెలింగ్‌ అంటే ఇష్టం. మా ఫ్యామిలీతో వెకేషన్స్‌లో సమయం గడపడం నాకు ఇష్టం. హెక్టిక్‌ షెడ్యూల్స్‌ పెట్టుకుని బ్యాక్‌ టు బ్యాక్‌ వర్క్‌ చేయడం నాకు ఇష్టం ఉండదు. కొంత విరామం తీసుకుంటేనే ఇండస్ర్టీ ఎలా ఉంది గమనించగలుగుతాం. నేను ఇండస్ర్టీలో ఉన్నా, ఇండస్ర్టీ బయటివారిలా అన్నీ గమనించాలనుకుంటా. తెలుగులో ఇప్పటిదాకా చాలా కథా చర్చలు జరిగాయి. కానీ ఏదీ కుదరలేదు. మలయాళంలో నేను స్ర?్టంగ్‌ పొజిషన్‌లో ఉన్నాను. అక్కడ మూవీస్‌ వదిలి మరో భాషకు వస్తే నన్ను నమ్ముకుని ప్రాజెక్ట్స్‌ చేేస వాళ్లు నష్టపోతారు.


చూడటానికి అలా కనిపిస్తానంతే: కయాదు లోహర్‌

‘డ్రాగన్‌ సినిమాకంటే ముందు సైన్‌ చేసిన సినిమా ఇది. ఈ కథ విన్నాక నా కెరీర్‌ లో ఇదొక స్పెషల్‌ మూవీ అవుతుందని అనిపించింది. ఇప్పటిదాకా నేను చేయని పాత్ర ఇందులో చేశాను. రెబెకా అనే పాత్రలో కనిపిస్తా. ఇంటెలెక్చువల్‌, రూటెట్‌గా ఉంటుంది. గ్లామర్‌ కోణంలో ప్రేక్షకులు నా పాత్రను చూడరు. ఈ సినిమా నన్ను నాయికగా మరింత మంచి పొజిషన్‌కు తీసుకెళ్తుందనే నమ్మకం ఉంది. నేను బయటకు మోడరన్‌ అమ్మాయిలా కనిపిస్తా కానీ రూరల్‌ అమ్మాయి మనస్తత్వమే నాలో ఉంటుంది. నాకు తెలియని భాషలో సినిమా చేస్తున్నప్పుడు వర్క్‌షాప్‌ చేస్తాను. భాష తెలిసిన వారి నుంచి సహాయం తీసుకుంటాను. ఈ సినిమాకు అలాగే చేశా. నేను ఎవరితో కలిసి నటించినా ధైర్యంగా నటిస్తా. టొవినోతో కలిసి నటించినప్పుడు భయమేసింది. నటనలో ఆయన బెస్ట్‌.

Updated Date - Apr 01 , 2026 | 07:23 PM