Solo Trip: ట్రావెల్ బేస్డ్ అడ్వెంచరస్ టాక్ షో ‘సోల్ ట్రిప్' త్వరలో..
ABN, Publish Date - Jan 26 , 2026 | 07:38 PM
టాలీవుడ్ స్టార్స్ తో ఓ ట్రావెల్ బేస్డ్ అడ్వెంచరస్ టాక్ షో మొదలు కానుంది. ‘సోల్ ట్రిప్' టైటిల్ తో ఈ షో రానుంది. హీరో విజయ్ దాట్ల దీనికోసం హోస్ట్‌గా మారారు.
టాలీవుడ్ స్టార్స్ తో ఓ ట్రావెల్ బేస్డ్ అడ్వెంచరస్ టాక్ షో మొదలు కానుంది. ‘సోల్ ట్రిప్' (Solo Trip) టైటిల్ తో ఈ షో రానుంది. హీరో విజయ్ దాట్ల దీనికోసం హోస్ట్‌గా మారారు. మన టాలీవుడ్ స్టార్ హీరోస్‌తో ఈ టాక్ షో ప్రేక్షకులను అలరించనుంది. ఇది వరకు పోస్టర్, అన్వేషి వంటి సినిమాలు చేసిన హీరో, నిర్మాత విజయ్ దాట్ల తన సొంత బ్యానర్ గండభేరుండ ఆర్ట్స్‌పై ఈ సెలబ్రిటీ టాక్‌షో సీజన్1ను ముగించుకుని, త్వరలోనే ప్రముఖ ఓటీటీ ఛానెల్‌లో రిలీజ్ చేయబోతున్నారు. గణతంత్య దినోత్సవం సందర్భంగా ‘సోల్ ట్రిప్’ టాక్ షో పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ మొదటి సీజన్‌లో హీరో జగపతిబాబు, శ్రీకాంత్, స్టార్ కమెడియన్ అలీ, హీరోయిన్స్ శివానీ రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్, వర్ష బొల్లమ్మ తదితరులు పాల్గొన్నారు.