Tollywood: పవన్‌కల్యాణ్‌ను కలిసిన టాలీవుడ్ నిర్మాతలు..
ABN, Publish Date - May 26 , 2026 | 07:25 PM
ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ను టాలీవుడ్ నిర్మాతలు కలిశారు. గోదావరి పుష్కరాల ఏర్పాట్ల కోసం రాజమండ్రి పర్యటనలో ఉన్న ఆయనతో నిర్మాతలు రవి శంకర్, సతీశ్ కిలారు, సాహు గారపాటి, నాగవంశీ తదితరులు సమావేశమయ్యారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ను (Pawan Kalyan) టాలీవుడ్ నిర్మాతలు కలిశారు. గోదావరి పుష్కరాల ఏర్పాట్ల కోసం రాజమండ్రి పర్యటనలో ఉన్న ఆయనతో నిర్మాతలు (Tollywood producers) రవి శంకర్, సతీశ్ కిలారు, సాహు గారపాటి, నాగవంశీ తదితరులు సమావేశమయ్యారు. పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్లారు. కొద్ది రోజులుగా చర్చలో నిలిచిన సింగిల్ స్ర్కీన్ థియేటర్ల గురించి మాట్లాడారు. ప్రస్తుతం సింగిల్ థియేటర్లు నష్టాల్లో ఉన్నాయని, వాటి యజమానుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. మల్టీప్లెక్స్ తరహాలోనే వచ్చిన లాభాల్లో నిర్మాతల నుంచి కొంత పర్సంటేజీ ఇస్త్తే, థియేటర్లు నిలదొక్కుకుంటాయని వివరించారు. ప్రభుత్వం వైపు నుంచి చొరవ తీసుకుని ఓ పాలసీని రూపొందించాలని పవన్‌ను కోరారు.
కొన్ని సంవత్సరాలుగా థియేటర్ల నిర్వాహణ కష్టంగా ఉందని, నెలవారీ ఖర్చులు కూడా పెరిగిపోయాయని, కరెంట్ చార్జీల్లో రాయితీ ఇస్తే థియేటర్ యజమానులపై కాస్త భారం తగ్గుతుందని పవన్‌కు వివరించారు. పరిశ్రమలో సమస్యలను విన్న డిప్యూటీ సీఎం సానుకూలంగా స్పందించారని నిర్మాతలు తెలిపారు. సినిమా పరిశ్రమకు ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చి, నిర్మాతల ప్రతిపాదనలపై దృష్టి సారించాలని ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్‌ను ఆదేశించారు.