సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Prabhas: అనుకున్నదే అయ్యింది.. ఆ సెంటిమెంట్ నిజమైంది

ABN, Publish Date - Jan 10 , 2026 | 03:45 PM

సెంటిమెంట్స్ చుట్టూ సినిమారంగం పరిభ్రమిస్తూ ఉంటుంది. రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) చుట్టూ ఓ సెంటిమెంట్ బలంగా తిరుగుతోంది. తాజా చిత్రంతో ఆ సెంటిమెంట్ మరోమారు ప్రూవ్ అయిందనీ నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు.

Prabhas

Prabhas: సెంటిమెంట్స్ చుట్టూ సినిమారంగం పరిభ్రమిస్తూ ఉంటుంది. రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) చుట్టూ ఓ సెంటిమెంట్ బలంగా తిరుగుతోంది. తాజా చిత్రంతో ఆ సెంటిమెంట్ మరోమారు ప్రూవ్ అయిందనీ నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు. అదేంటంటే.. ప్రభాస్ తాజా చిత్రం 'ద రాజాసాబ్ (The Raja Saab)' జనవరి 9న జనం ముందు నిలచింది... అయితే వారి మనసులను గెలవలేదని తేలిపోయింది. ప్రస్తుతం తెలుగునాటనే కాదు, యావద్భారతంలోనూ ప్రభాస్ కు ఉన్న క్రేజ్ అలా ఇలా లేదు. అందుకే ఆయనను 'ద బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ఆఫ్ ఇండియా' అంటూ కీర్తిస్తున్నారు. అలాంటి ప్రభాస్ హీరోగా రూపొందిన హారర్ కామెడీ 'ద రాజాసాబ్' బాక్సాఫీస్ వద్ద కంగు తినింది... అందుకు ఆ సినిమా టైటిల్ కారణమని అంటున్నారు.

అదేంటి- ప్రభాస్ 'రాజా'యే కదా- అందువల్ల 'రాజాసాబ్' అనడంలో తప్పేముంది అంటే - ఆ పదం ఇంగ్లిష్ అక్షరం 'ఆర్'తో మొదలు కావడమే కొంప ముంచిందని కొందరి మాట... ఇప్పటి దాకా ప్రభాస్ నటించిన చిత్రాలలో 'ఆర్' అక్షరంతో టైటిల్ ఉన్న ఏ సినిమా కూడా విజయపథంలో పయనించలేదట.. అందువల్లే 'ద రాజాసాబ్' పరాజయానికీ 'ఆర్' అక్షరం కారణమంటున్నారు.. ఇంగ్లిష్ లెటర్ 'ఆర్'తో మొదలయ్యే టైటిల్ తో ప్రభాస్ సినిమాలు వస్తే పరాజయం పాలవుతాయి అని ఇప్పటికి నాలుగుసార్లు ప్రూవ్ అయింది... అలా ప్రభాస్ 'ఆర్' లెటర్ తో నటించిన తొలి సినిమా 'రాఘవేంద్ర'... 2003లో విడుదలైన 'రాఘవేంద్ర' చిత్రం ప్రభాస్ కు రెండో మూవీ... ఈ పిక్చర్ ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది... ఆ తరువాత దాదాపు 9 ఏళ్ళకు ప్రభాస్ హీరోగా 'రెబల్' మూవీ రూపొందింది... ఈ సినిమా కూడా 'ఆర్' లెటర్ తో ఆరంభమయ్యేదే... ఇందులో తన పెదనాన్న కృష్ణంరాజుతో కలసి నటించారు ప్రభాస్... అప్పట్లో వరుస విజయాలతో సాగుతోన్న లారెన్స్ రాఘవేంద్ర డైరెక్షన్ లో 'రెబల్' రూపొందింది... ఈ సినిమా ప్రభాస్, లారెన్స్ ఇద్దరికీ చేదు అనుభవాన్ని రుచిచూపింది.

'రెబల్' వచ్చిన పదేళ్ళకు 2022లో మరోమారు 'ఆర్' లెటర్ తో సాగారు ప్రభాస్... ఈ సారి 'రాధే శ్యామ్' అనే మూవీతో జనాన్ని పలకరించారు... ఈ చిత్రానికి ముందుగా 'బాహుబలి' సిరీస్ తో ప్రభాస్ కు ఇంటర్నేషనల్ స్టార్ గా గుర్తింపు లభించింది... 'రాధే శ్యామ్'లోనూ ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు ఓ పాత్ర పోషించారు... రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందిన 'రాధేశ్యామ్' పరాజయాన్ని చవిచూసింది... ఇలా 'ఆర్' లెటర్ టైటిల్స్ ప్రభాస్ కు అచ్చిరావని తెలిసిన 'ద రాజాసాబ్' మేకర్స్ టైటిల్ కు ముందుగా 'ద' అన్న పదాన్ని జోడించారు... అయినప్పటికీ 'ఆర్' సెంటిమెంట్ ప్రభాస్ ను వెంటాడింది... మరోమారు వేటు వేసింది... 'ద రాజాసాబ్' రిజల్ట్ తో ఇకపై ప్రభాస్ 'ఆర్' లెటర్ తో స్టార్టయ్యే టైటిల్స్ ను ఎంచుకోబోరని పరిశీలకులు అంటున్నారు... ఏమవుతుందో చూడాలి.

Updated Date - Jan 10 , 2026 | 05:40 PM