జంగా టీజర్.. బిగ్ బాస్ త్రిగుణ్ నట విశ్వరూపం
ABN, Publish Date - Nov 13 , 2026 | 05:55 PM
టాలీవుడ్ టాలెంటెడ్ హీరో త్రిగుణ్ (Trigun) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్ 10 (Bigg Boss Telugu 10) లో కంటెస్టెంట్‌గా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు.
టాలీవుడ్ టాలెంటెడ్ హీరో త్రిగుణ్ (Trigun) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్ 10 (Bigg Boss Telugu 10) లో కంటెస్టెంట్‌గా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. హౌస్‌లో తనదైన ఆటతీరుతో, ఎవరి ముఖం మీదైనా సరే తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్లు స్పష్టంగా చెబుతూ బిగ్‌బాస్ ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నాడు. ఆట పరంగా ఎంతో యాక్టివ్‌గా ఉంటూ, నామినేషన్స్, టాస్క్‌లలో దూసుకుపోతున్న త్రిగుణ్ హౌస్‌లో తన స్ట్రాటజీతో బలమైన పోటీదారుడిగా నిలుస్తున్నాడు.
ఇదిలా ఉంటే, బిగ్‌బాస్ హౌస్‌లో సందడి చేస్తున్న త్రిగుణ్ నటిస్తున్న తాజా సినిమాకు సంబంధించిన అప్డేట్ సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. ఆయన హీరోగా, వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రలో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం జంగా. కేవిన్ గద్దం దర్శకత్వంలో ఆర్కే ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై రమ్య కిలారి, జయచంద్ర నాయుడు కిలారి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. తాజాగా విడుదలైన ఈ సినిమా గ్లింప్స్, ఫస్ట్ లుక్ పోస్టర్లో త్రిగుణ్ లుక్ రా అండ్ రస్టిక్ మాస్ అవతారంలో కనిపించి గూస్బంప్స్ తెప్పిస్తుంది. ఈ సినిమాలో త్రిగుణ్ నట విశ్వరూపం చూపించినట్లు ఈ గ్లింప్స్ చూస్తుంటేనే అర్ధం అవుతుంది.
'కొన్ని లక్షల ఏండ్లు పట్టింది పశువు మనిషి అవ్వడానికి.. మళ్ళీ పశువు అవుతానంటే నేను ఒప్పుకోను.. ', 'మనిషి పశువు అయితే మరణవదమైతది' అనే పవర్ఫుల్ డైలాగ్‌తో సాగే ఈ గ్లింప్స్ టెర్రిఫిక్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో ఆకట్టుకుంటోంది. పూర్తిగా మాస్ అండ్ రా లుక్‌లో కనిపిస్తున్న త్రిగుణ్ యాక్షన్ సీక్వెన్స్‌లు గూస్బంప్స్ తెప్పిస్తున్నాయి. అలాగే గన్ పట్టుకుని వైలెంట్‌గా కనిపించిన వరలక్ష్మి శరత్‌కుమార్ లుక్ సినిమాపై అంచనాలను విపరీతంగా పెంచేసింది. నేపథ్య సంగీతం, విజువల్స్ సినిమా స్థాయిని పెంచేలా ఉన్నాయి. నేహా పాఠాన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి వెంకట్ సి. దిలీప్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కి సిద్ధమవుతోంది. మరి ఈ సినిమాతో త్రిగుణ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.