సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

ఓ సుకుమారి ట్రైలర్.. నవ్వులే నవ్వులు

ABN, Publish Date - Jul 10 , 2026 | 08:59 PM

మసూద చిత్రంతో నటుడిగా సాలిడ్ గుర్తింపు తెచ్చుకున్న తిరువీర్ (Thiruveer).. అలాంటి మంచి హిట్ కోసం కష్టపడుతున్నాడు. విభిన్నమైన కథలను ఎంచుకుంటున్నా విజయాలను మాత్రం అందుకోలేకపోతున్నాడు.

Oh Sukumari

మసూద చిత్రంతో నటుడిగా సాలిడ్ గుర్తింపు తెచ్చుకున్న తిరువీర్ (Thiruveer).. అలాంటి మంచి హిట్ కోసం కష్టపడుతున్నాడు. విభిన్నమైన కథలను ఎంచుకుంటున్నా విజయాలను మాత్రం అందుకోలేకపోతున్నాడు. తాజాగా తిరువీర్ మరో వైవిధ్యమైన కథతో ప్రేక్షకుల ముందకు రానున్నాడు. తిరువీర్, టాలెంటెడ్ నటి ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh) కాంబినేషన్‌లో వస్తున్న సరికొత్త చిత్రం ఓ... సుకుమారి (Oh Sukumari). గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన ఈ సినిమాకు భరత్ దర్శన్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఒక పల్లెటూరి నేపథ్యంలో సాగే ఫ్యామిలీ, లవ్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.


ట్రైలర్ ప్రారంభంలో ఊరి నాటక మండలి సీన్లతో ఎంటర్‌టైనింగ్‌గా మొదలైంది. దామినికి చిన్నప్పటి నుంచి ఒక సమస్య ఉంటుంది. ఆమె ఎవరిని పట్టుకున్నా.. ఆమెను ఎవరు పట్టుకున్నా కరెంట్ షాక్ కొడుతుంది. దీంతో ఆమెకు పెళ్లి కాదు. ఇక ఎలాగైనా దామిని పెళ్లి చేసి ఊరికి సర్పంచ్ కావాలని ఝాన్సీ ప్రయత్నిస్తూ ఉంటుంది. ఆపరేషన్ సుకుమారి పేరుతో అబ్బాయిలను వెతుకుతూ ఉంటుంది. ఇక దామినిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు హీరో. పెళ్లి తరువాత భార్య సమస్యతో అతను ఎన్ని తిప్పలు పడ్డాడు. అసలు ఆమెకు ఆ సమస్య ఎలా వచ్చింది.. ? చివరకు ఎలా తగ్గింది.. ? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.


ట్రైలర్ మొత్తం నవ్వులే నవ్వులు. తిరువీర్, ఐశ్వర్య రాజేష్‌ల మధ్య వచ్చే లవ్ ట్రాక్, కామెడీ సీన్లు ఆకట్టుకున్నాయి. ఐశ్వర్య రాజేష్ ఒక పవర్‌ఫుల్ విలేజ్ గర్ల్ పాత్రలో కనిపిస్తుండగా.. తిరువీర్ తన మార్క్ టైమింగ్‌తో మెప్పించాడు. అయితే కథ కేవలం కామెడీ, లవ్‌తోనే కాకుండా.. ద్వితీయార్ధంలో వచ్చే ఫైట్లు, యాక్షన్ ఎపిసోడ్లు సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతున్నాయి. భరత్ మంచిరాజు అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ట్రైలర్‌కు అదనపు బలాన్ని ఇచ్చింది. ఈ సినిమాను జూలై 17వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. మరి ఈ సినిమాతో తిరువీర్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Updated Date - Jul 10 , 2026 | 08:59 PM