తిరువీర్.. 'పాపం ప్రతాప్' ట్రైలర్
ABN, Publish Date - Apr 12 , 2026 | 11:09 AM
గత సంవత్సరం ది గ్రేట్ ఫ్రీ వెడ్డింగ్ షో వంటి మంచి హిట్ సినిమా తర్వాత తిరువీర్ హీరోగా తెరకెక్కిన చిత్రం పాపం ప్రతాప్. పాయల్ రాధాకృష్ణ కథానాయిక.
తిరువీర్ (Thiruveer) హీరోగా తెరకెక్కిన చిత్రం పాపం ప్రతాప్ (Papam Prathap). పాయల్ రాధాకృష్ణ కథానాయిక. సీనియర్ నటి రాశి, అజయ్ ఘోష్, శ్రీనివాస్ అవసరాల, దేవీ ప్రసాద్, గోపరాజు రమణ, రఘు బాబు, ప్రసాద్ బెహ్ర వంటి వారు ప్రధాన పాత్రల్లో నటించారు. ఎస్పీ దుర్గా నరేశ్ (S.P. Durga Naresh) దర్శకత్వం వహించాడు. ఏప్రిల్ 17న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే విడుదల చేసిన టీజర్ సినిమాపై మంచి అంచనాలు తీసుకు రాగా తాజాగా ట్రైలర్ విడుదల చేశారు.
ఈ ట్రైలర్‌ను చూస్తే.. ఔట్ అండ్ రూరల్ ఫ్యామిలీ బ్యాక్‌డ్రాప్‌లో కామెడీ, ఎమోషనల్‌గా సినిమాను తెరకెక్కించినట్లు అర్థమవుతోంది. హీరో కొత్తగా పెళ్లి చేసుకోవడం కొన్నాళ్లు లైఫ్ సాఫీగా సాగుతుందని అనుకున్న సమయంలో భార్య ఇంటి నుంచి వెళ్లిపోవడం తనను తిరిగి తీసుకు రావడం కోసం భర్త పడే ఇబ్బందులు, ఈ నేపథ్యంలో అతని గురించి ఊరి ప్రజలు మాట్లాడుకునే మాటలు తదితర అంశాలతో కుటుంబ సభ్యులకు చేరువయ్యేలా సినిమాను రూపొందించారు. వీలుంటే ట్రైలర్‌పై మీరూ ఓ లుక్కేయండి.