అది నా పిల్లరా అంటున్న బేబీ నిర్మాత
ABN, Publish Date - Jul 27 , 2026 | 07:30 PM
బేబీ (Baby), చెన్నై లవ్ స్టోరీ (Chennai Love Story) లాంటి సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ హిట్స్ తరువాత ప్రముఖ నిర్మాత ఎస్ కె ఎన్ మరో కల్ట్ బొమ్మకు సిద్ధమయ్యాడు.
బేబీ (Baby), చెన్నై లవ్ స్టోరీ (Chennai Love Story) లాంటి సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ హిట్స్ తరువాత ప్రముఖ నిర్మాత ఎస్ కె ఎన్ మరో కల్ట్ బొమ్మకు సిద్ధమయ్యాడు. ఈసారి కూడా విభిన్నమైన కథను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ప్రొడ్యూసర్‌గా వరుస విజయాలతో దూసుకుపోతున్న ఆయన అది నా పిల్లరా అనే టైటిల్ తో ఒక సినిమా తెరకెక్కించనున్నాడు. వర్సటైల్ హీరో తిరువీర్ హీరోగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో గ్లామరస్ బ్యూటీ ఆషికా రంగనాథ్ హీరోయిన్ గా కనిపించనుంది. ఈ చిత్రంతో కృష్ణ అనే నూతన దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నట్లు సమాచారం.
బేబీ సినిమాలో ఆనంద్ దేవరకొండ.. హీరోయిన్ ని ఉద్దేశించి అది నా పిల్లరా అంటాడు. ఆ డైలాగ్ సోషల్ మీడియాని షేక్ చేసింది. ఇప్పుడు ఆ పేరునే నిర్మాత ఎస్ కె ఎన్ టైటిల్ గా పెట్టి మరింత హైప్ క్రియేట్ చేశాడు. అవుట్ అండ్ అవుట్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ కాన్సెప్ట్‌తో ఈ చిత్రం రూపుదిద్దుకోనుంది. నేటితరం యూత్‌కి కనెక్ట్ అయ్యే ఎమోషన్స్, లవ్ అండ్ రొమాన్స్ ఎలిమెంట్స్‌తో దర్శకుడు కృష్ణ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నడట. తిరువీర్ కాకుండా ఈ చిత్రంలో మరో హీరోగా విశ్వదేవ్ రాచకొండ నటించనున్నట్లు తెలుస్తోంది.
త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. తిరువీర్ కి ఈమధ్య ఒక్క హిట్ కూడా లేదు. సినిమాలు అయితే చేస్తున్నాడు కానీ, విజయాలు దక్కడం లేదు. ప్రస్తుతం ఆయన భగవంతుడు అనే సినిమాలో నటిస్తున్నాడు. ఆ సినిమా ఫినిష్ అవ్వగానే అది నా పిల్లరా సినిమాను మొదలుపెట్టనున్నాడు. చెన్నై లవ్ స్టోరీతో మంచి హిట్ అందుకున్న ఎస్ కె ఎన్, సాయి రాజేష్.. ముచ్చటగా మూడో సినిమాతో హ్యాట్రిక్ అందుకుంటారేమో చూడాలి.