సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

తిమ్మరాజుపల్లి టీవీ.. ఆ రోజుల్లోకి తీసుకెళ్తుంది..

ABN, Publish Date - Mar 21 , 2026 | 08:18 PM

కిరణ్‌ అబ్బవరం (Kiran Abbavaram) నిర్మాతగా మారి సుమైర స్టూడియో్‌స్‌తో కలిసి కేఏ ప్రొడక్షన్స్‌ పై నిర్మిస్తున్న సినిమా ‘తిమ్మరాజుపల్లి టీవీ’ (Thimmarajupalli TV).

కిరణ్‌ అబ్బవరం (Kiran Abbavaram) నిర్మాతగా మారి సుమైర స్టూడియో్‌స్‌తో కలిసి కేఏ ప్రొడక్షన్స్‌ పై నిర్మిస్తున్న సినిమా ‘తిమ్మరాజుపల్లి టీవీ’ (Thimmarajupalli TV). సాయితేజ్‌, వేద జలంధర్‌ జంటగా నటిస్తున్నారు. వి.మునిరాజు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. విలేజ్‌ బ్యాక్‌ డ్రాప్‌లో సాగే పీరియాడిక్‌ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా ఏప్రిల్‌ 17న గ్రాండ్‌ థియేట్రికల్‌ రిలీజ్‌కు రెడీ అవుతోంది. శనివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో నిర్మాత, హీరో కిరణ్‌ అబ్బవరం మాట్లాడుతూ ‘మునిరాజ్‌ మా సినిమాలకు ఆన్‌లైన్‌ ఎడిటర్‌గా వర్క్‌ చేస్తుండేవాడు. ఓ సందర్భంలో డైరెక్టర్‌ కావాలనుందని చెప్పాడు. తన కథంతా విన్నాను. ఇండస్ట్రీలో నేను సెటిల్‌ అయ్యాక ఇలా కొత్తవాళ్లను ఎంకరేజ్‌ చేయాలనుకున్నారు. ఇప్పుడు ఈ సినిమాతో కుదిరింది. ఈ కథ 95 సంవత్సరంలో జరుగుతుంది. రియాలిటీకి దగ్గరగా ఉండే సినిమా ఇది. చిన్న బడ్జెట్‌లో నిజాయతీగా చేసిన ప్రయత్నమిది. సమ్మర్‌లో ఈ సినిమా చూస్తూ మీ ఊరి ప్రజల క్యారెక్టర్స్‌తో కనెక్ట్‌ అవుతారు. టీవీ ఇంపార్టెన్స్‌ ఇంత ఉండేదా అని అనుకుంటారు. 90 కిడ్స్‌కు అయితే వారి గతమంతా గుర్తుకు వస్తుంది. మా సంస్థలో మరో రెండు చిత్రాలు చేస్తున్నాం. కొత్తవారికి అవకాశాలు కల్పిస్తున్నాం. చిన్నస్థాయిలో ఉన్న వారికి నాకు వీలైనంత అవకాశం కల్పించాలని అనుకుంటున్నా’ అన్నారు.

దర్శకుడు వి.మునిరాజు మాట్లాడుతూ ‘మనం ఎంత మంచి కథ రాసినా, ఆ కథకు తగ్గ నటీనటులు కావాలి. ఒక నాటకం చూసి ఈ కాస్టింగ్‌ అందరినీ సెలెక్ట్‌ చేసుకున్నాను. వాళ్లంతా అద్భుతంగా నటించారు. ఈ మూవీ చూస్తూ ఆ ప్రపంచంలోకి వెళ్తారు. ఎంటర్‌టైన్‌మెంట్‌, సస్పెన్స్‌తోపాటు భావోద్వేగానికి లోనవుతారు’ అని అన్నారు.

Updated Date - Mar 21 , 2026 | 08:23 PM