Thimmarajupalli tv: ఆ పాత్ర దక్కడం వెనుక ఎన్నో కష్టాలున్నాయి..
ABN, Publish Date - May 03 , 2026 | 04:24 PM
'సినిమా చూసిన వారంతా సిద్దయ్య పాత్ర చేసింది నువ్వేనా? అని అడుగుతుంటే ఎంతో సంతోషంగా, సంతృప్తిగా అనిపించింది.
'సినిమా చూసిన వారంతా సిద్దయ్య పాత్ర చేసింది నువ్వేనా? అని అడుగుతుంటే ఎంతో సంతోషంగా, సంతృప్తిగా అనిపించింది. కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) సినిమా చూసి టీం అందరినీ మెచ్చుకున్నారు. బయట ఇంత సైలెన్స్‌గా ఉన్నావ్.. స్క్రీన్ మీద అలా కనిపించావ్ ఏంట్రా అని ఆశ్చర్యపోయారు' అని లతీష్ అన్నారు. ‘తిమ్మరాజుపల్లి టీవీ’ చిత్రంలో సిద్దయ్యగ్గా నెగటివ్ షేడ్ ఉన్న పాత్ర పోషించి మెప్పించారు. 50 మంది కొత్త ఆర్టిస్టులు, టెక్నీషియన్లను పరిచయం చేస్తూ కిరణ్ అబ్బవరం నిర్మించిన చిత్రం ‘తిమ్మరాజుపల్లి టీవీ’ (Thimmarajupalli tv) . వి. మునిరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చి ఆకట్టుకుంది. ఈ సందర్భంగా లతీష్ తన ఆనందాన్ని విలేకర్లతో పంచుకున్నారు.
నగరిలో వ్యవసాయ ఆధారిత నిరుపేద కుటుంబం మాది. ఉప్పు దొంగతనం చేసుకుని తిన్న రోజులున్నాయి. అమ్మనాన్న, అన్నయ్య కష్టపడి చదివించారు సినిమాల్లోకి వచ్చానని మా అన్నయ్య నాతో మాట్లాడటం మానేశాడు. ఈ సినిమాలో నా పర్ఫామెన్స్ చూసి చాలా కాలం తర్వాత మాట్లాడాడు. ఈ ప్రయాణంలో నాకు అండగా నిలబడిన వారిలో అక్క చాముండేశ్వరి, మామ కోటేశ్వరరావు ముందుంటారు. బెంగళూరులో కొన్ని రోజులు ఉద్యోగం చేశాను. 2017లో హైదరాబాద్ వచ్చి సినిమాల్లో ప్రయత్నించాను. యాక్టింగ్ బావుందని చెప్పారు.. కానీ ఎవ్వరూ అవకాశం ఇవ్వలేదు. కొన్ని కష్టాలు, కరోనా వల్ల గ్యాప్ వచ్చింది. ఆ
బీ స్టూడియోలో యాక్టింగ్ కోర్స్ కోసం లక్ష అడిగారు. డబ్బులున్న వాళ్లకేనా ఈ యాక్టింగ్ అని దీనంగా అడిగాను. దాంతో నా దగ్గర రూపాయి కూడా తీసుకోకుండా ఫ్రీగా ట్రైనింగ్ ఇచ్చారు. అక్కడ పదుల సంఖ్యలో నాటకాలు వేశాను. ఆ నాటకాలు వేస్తున్నప్పుడే ‘తిమ్మరాజు పల్లి టీవీ’ అసోసియేట్ డైరెక్టర్ చూసి అక్కడే మా అందరినీ ఆడిషన్స్ తీసుకున్నారు. ఒకప్పుడు విలన్‌గా నటించిన వారు తరువాత హీరోలుగా మారారు. ఇందులో నాది కూడా విలన్ పాత్ర అని చెప్పడంతో ఆ స్టార్స్ అంతా గుర్తుకు వచ్చారు. సినిమాకి హీరో ఎంత ముఖ్యమో విలన్ కూడా అంతే ముఖ్యం. సిద్దయ్య పాత్ర కోసం ముప్పై వెయిట్ కిలోలు పెరిగాను. సినిమా చూసిన వారంతా అది నువ్వేనా? అని అడుగుతుంటే నాకు ఎంతో సంతోషంగా, సంతృప్తిగా అనిపించింది నరేష్ అగస్త్య కూడా అభినందించారు. నలుగురు శిష్యులు ఒకే సినిమాలో నటించడంతో బషీర్ సార్ కూడా సంతోషించారు. ఇన్‌స్టిట్యూట్‌కి వెళ్లిన తరువాత నా గురించి చెప్పి.. నన్ను హగ్ చేసుకున్నారు. ఆ మూమెంట్ ఎప్పటికీ మర్చిపోలేను. ప్రస్తుతం బీ స్టూడియోలో పార్ట్ టైంగా పని చేస్తున్నాను. చాలా కథలు వింటున్నాను. కానీ ఇంత వరకు ఏదీ క్లారిటీ రాలేదు. త్వరలోనే అన్నీ ఓ కొలిక్కి వచ్చేలా ఉన్నాయి.