పూర్తి స్థాయిలో ప్రయత్నించలేదు.. ఆలస్యమైంది: ‘తిమ్మరాజుపల్లి టీవీ’ నటుడు
ABN , Publish Date - May 23 , 2026 | 07:57 PM
హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్‌తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్‌పై నిర్మించిన చిత్రం ‘తిమ్మరాజుపల్లి టీవీ’. ఈ సినిమాలో రాజప్పగా నటించిన ప్రదీప్ కొట్టె మీడియాతో ముచ్చటించారు.
హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) సుమైర స్టూడియోస్‌తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్‌పై నిర్మించిన చిత్రం ‘తిమ్మరాజుపల్లి టీవీ’ (Thimmarajupalli TV). తేజ వేల్పుచర్ల సహ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాతో వి. మునిరాజు (V Muniraju) దర్శకుడిగా పరిచయమైన విషయం తెలిసిందే. విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో సాగే పీరియాడిక్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రం థియేటర్లలో మంచి సక్సెస్‌నే అందుకుంది. ఈ సినిమా మే 15 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాలో నటించిన నటుడు ప్రదీప్ కొట్టె (Pradeep Kotte).. సినిమా సక్సెస్‌పై ఆనందం వ్యక్తం చేస్తూ.. అనేక విషయాలను షేర్ చేసుకున్నారు.
‘‘మాది చిత్తూరు జిల్లా పలమనేరు. చెన్నైలో జాబ్ చేస్తూ.. హైదరాబాద్‌కి షిఫ్ట్ అయ్యాను. ఇక్కడకు వచ్చాక షార్ట్ ఫిల్మ్స్ అంటూ యాక్టింగ్ వైపు వచ్చాను. బీ స్టూడియోలో బషీర్ మాస్టర్ నేతృత్వంలో కొన్ని నాటకాలలో యాక్ట్ చేశాను. ఆ నాటకాల్ని మా డైరెక్టర్ వి. మునిరాజు చూసి, ‘తిమ్మరాజుపల్లి టీవీ’లోని ‘రాజప్ప’ పాత్ర కోసం ఆడిషన్ చేశారు. ఈ సినిమాకు కిరణ్ అబ్బవరం నిర్మాత అని తెలియగానే, సినిమాపై చాలా కాన్ఫిడెంట్ వచ్చింది. నేను చేసిన రాజప్ప పాత్రకు మంచి ప్రశంసలు దక్కాయి. నా తొలి చిత్రం, తొలి అవకాశం అంటే ఇదే అని చెప్పుకుంటాను. షార్ట్ ఫిల్మ్స్, ఇండిపెండెంట్ సినిమాలు చేశాను కానీ.. తొలి ఫీచర్ ఫిల్మ్, మొదటి సారిగా స్క్రీన్ మీద కనిపించింది మాత్రం ఈ చిత్రంలోనే.
నేను నా జాబ్ చేస్తూనే సినిమా అవకాశాల కోసం ప్రయత్నించాను. వర్క్ ఫ్రమ్ హోం, లీవ్స్ అంటూ.. ఈ మూవీని కూడా మ్యానేజ్ చేశాను. నేను పూర్తి స్థాయిలో ప్రయత్నించలేకపోవడంతోనే ఇంత ఆలస్యమై ఉంటుందని భావిస్తున్నాను. గత పదేళ్ల నుంచి రెండింటిని బ్యాలెన్స్ చేస్తూనే ఉన్నాను. నాకు చిన్నప్పటి నుంచీ సినిమాలంటే ఇష్టం. నాకు అదొక ప్యాషన్ అని తెలీదు. ఇంజనీరింగ్ టైంలో ఓ షార్ట్ ఫిల్మ్ చేశాను. నాకు నటన మీద ఇంట్రెస్ట్ ఉందని అప్పుడర్థమైంది. నాకు ఈ పదేళ్ల అనుభవంలో కెమెరా భయం పోయింది. డైరెక్టర్ మునిరాజు ప్రతీ ఒక్క విషయాన్ని, సీన్‌ను డీటైలింగ్‌గా వివరించేవారు. వర్క్ షాప్ మాకెంతో ఉపయోగపడింది. ప్రస్తుతం కొన్ని కథలు విన్నాను. మంచి ప్రాముఖ్యత ఉన్న పాత్రలే పోషించాలని వెయిట్ చేస్తున్నాను. అవకాశాలు వస్తున్నాయి కదా.. అని ఏదో ఒకటి చేయాలని అనుకోవడం లేదు. త్వరలోనే మంచి పాత్రతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తాను’’ అని తెలిపారు.
ఇవి కూడా చదవండి:
అల్లు అయాన్‌కు ఆర్‌సీబీ ప్లేయర్ స్పెషల్ గిఫ్ట్.. బన్నీ పోస్ట్ వైరల్!
40 ఏళ్ల తర్వాత సీక్వెల్‌కు ప్లాన్.. ఈ మూవీ వివరాలు తెలిస్తే షాకే!
ఏయన్నార్ నటవారసునిగా మెప్పించిన నాగార్జున
MEGA158: ‘దట్స్ ఇట్.. ద బ్లడీ బెంచ్ మార్క్’.. టైటిల్ లీక్ చేసేస్తా!