సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

RB Choudhary: డైరెక్ట‌ర్ల‌కు గాడ్‌ఫాద‌ర్‌! ఆర్‌బీ చౌద‌రి ప‌రిచ‌యం చేసిన డైరెక్ట‌ర్లు వీరే.. ఇప్పుడు టాప్‌లో

ABN, Publish Date - May 05 , 2026 | 10:37 PM

ప్రముఖ నిర్మాత, ఆర్ బి చౌదరి ( RB Choudhary) మృతి నేప‌థ్యంలో సౌత్ సినీ ఇండస్ట్రీ షాక్‌లోకి వెళ్లిపోయింది.

RB Choudhary

ప్రముఖ నిర్మాత, ఆర్ బి చౌదరి ( RB Choudhary) మృతి నేప‌థ్యంలో సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ షాక్‌లోకి వెళ్లిపోయింది. మూడున్నర ద‌శాబ్దాల క్రితం సినిమాల నిర్మాణ చేప‌ట్టి కుటుంబ సంబంధాలు, మంచి సంగీతం ఉన్న చిత్రాల‌ను మాత్ర‌మే నిర్మిస్తూ త‌న‌కు, త‌న సంస్థ‌ సూప‌ర్ గుడ్ ఫిలింస్‌కంటూ మంచి పేరు అన‌తి కాలంలోనే సాధించుకున్నారు.

అంతేకాదు ఇప్ప‌టివ‌ర‌కు త‌మిళ‌, తెలుగు, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల‌లో క‌లిపి 100 సినిమాలు నిర్మించ‌గా అందులో దాదాపు 90 శాతం విజ‌య‌వంత‌మైన చిత్రాలే ఉండ‌డం గ‌మ‌నార్హం. వాటిలో తెలుగులో వెంకటేశ్‌, నాగార్జున, పవన్‌కల్యాణ్‌, రాజశేఖర్‌ తదితర హీరోలతో తెలుగు ప్రేక్షకులకు ఆర్‌బీ చౌదరి అందించిన క్లాసిక్‌ హిట్స్‌లో 'శుభాకాంక్షలు', ‘సుస్వాగతం, ‘రాజా’, ‘సంక్రాంతి’, ‘సూర్యవంశం’, ‘నువ్వొస్తావని’, ‘నవ వసంతం’, ‘సింహరాశి’, ‘అన్నవరం’, ‘గోరింటాకు’, ‘భీమిలి కబడీ జట్టు’, 'ప్రియ‌మైన నీకు', 'శివ‌రామ‌రాజు', 'నిన్నే ప్రేమిస్తా'వంటి చిత్రాలు ఉన్నాయి. ఇవన్నీ సంగీత పరంగా కూడా పేరొందాయి.

అయితే.. అప్‌క‌మింగ్ డైరెక్ట‌ర్లు ఎంతో మందికి అవ‌కాశాలు ఇచ్చి వారికి గాడ్‌ఫాద‌ర్‌గా నిలిచారు అర్‌బీ చౌద‌రి. ఆయ‌న తెలుగులో నిర్మించిన సుస్వాగ‌తంతో భీమినేని శ్రీనివాస రావు (Bhimaneni Srinivasa Rao) , సింహా రాశితో స‌ముద్ర (Samudra ), నువ్వు వ‌స్తావ‌ని చిత్రంతో ప్ర‌తాప్ (V. R. Prathap,), నిన్నే ప్రేమిస్తాతో షిండే ( R. Shinde.), అదృష్టంతో శేఖ‌ర్ సూరి (Sekhar Suri), భీమిలీ క‌బ‌డ్డీ జ‌ట్టుతో తాతినేని స‌త్య (Tatineni Satya) వంటి ద‌ర్శ‌కుల‌ను తెలుగు తెర‌కు ప‌రిచ‌యం చేశారు. అంతేగాక తెలుగులో ఎక్కువ‌గా వెంక‌టేశ్‌, రాజశేఖ‌ర్‌ల‌తో సినిమాలు చేసిన అర్‌బీ చౌద‌రి త‌మిళంలో మాత్రం శ‌ర‌త్ కుమార్‌, ప్ర‌స్తుత త‌మిళ‌నాడు సీఎం విజ‌య్‌తోనే అత్య‌ధిక సినిమాలు నిర్మించారు.

ఇటీవలే ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీవీకె పార్టీ అధినేత విజయ్ (Vijay) కెరీర్‌ తొలినాళ్ళలో ‘పూవే ఉనక్కాగ’ (1996), ‘లవ్‌టుడే’ (1997), ‘తుళ్ళాద మనముమ్‌ తుళ్ళుమ్‌’ (1999), ‘షాజహాన్‌’ (2001), ‘తిరుప్పాచ్చి’ (2005), ‘జిల్లా’ (2014) వంటి చిత్రాలను తీశారు.

ఇక‌ త‌మిళంలో విక్ర‌మ‌న్ (Vikraman), కెఎస్ ర‌వికుమార్ ( K. S. Ravikumar), లింగుసామి (N. Lingusamy), శ‌శి (Sasi), ఎజిల్, బాల శేఖరన్‌, బృందా సారథి, రవి మారియా వంటి 34 మంది దర్శకులను త‌మ సంస్థ ద్వారానే ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం చేశారు. వీరిలో చాలామంది ఆ తర్వాత పెద్ద పెద్ద స్టార్ల‌తో సినిమాలు చేసి టాప్ డైరెక్ట‌ర్ల జాబితాలో చేర‌డం విశేషం. చివ‌ర‌గా చౌద‌రి తెలుగులో చిరంజీవి గాడ్‌ఫాద‌ర్ చిత్రానికి స‌హా నిర్మాత‌గా వ్య‌హ‌హ‌రించారు. అంతేగాక గ‌త సంవ‌త్స‌రం విశాల్‌తో 99 వ చిత్రం, కొడుకు జీవాతో 100 వ చిత్రాలు మొద‌లు పెట్ట‌గా అవి షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉన్నాయి.

Updated Date - May 06 , 2026 | 12:09 PM