సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Irumudi: ఇరుముడి ఆ సూపర్ హిట్ సినిమాకు రీమేకా..

ABN, Publish Date - Jan 26 , 2026 | 05:30 PM

మాస్ మహారాజా రవితేజ (Raviteja) ఒక మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ సంక్రాంతి కానుకగా భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

Irumudi

Irumudi: మాస్ మహారాజా రవితేజ (Raviteja) ఒక మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ సంక్రాంతి కానుకగా భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకున్నప్పటికీ అంతగా కలక్షన్స్ ను అందుకోలేకపోయింది. విజయాపజయాలను లెక్క చేయని రవితేజ వరుస సినిమాలను లైన్లో పెడుతూనే ఉన్నాడు. గత కొన్నిరోజులుగా రవితేజ.. శివ నిర్వాణ(Shiva Nirvana) దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెల్సిందే. ఆ వార్తలను నిజం చేస్తూ నేడు రవితేజ పుట్టినరోజున వీరి కాంబోలో ఒక సినిమాను ప్రకటించారు. ఆ సినిమాకు ఇరుముడి (Irumudi) అనే టైటిల్ ని ఫిక్స్ చేస్తూ ఫస్ట్ లుక్ ని కూడా రిలీజ్ చేశారు. అయ్యప్ప మాలలో ఉన్న రవితేజ తలపై ఇరుముడి పెట్టుకొని ఒక పాపను ఎత్తుకున్నట్లు ఉంది.

కమర్షియల్ సినిమాలు, యాక్షన్ సినిమాలతో అభిమానుల ముందుకు వచ్చిన రవితేజ ఈసారి కొత్తగా రాబోతున్నట్లు పోస్టర్ చూస్తుంటేనే అర్ధమవుతుంది. ఈ పోస్టర్ చూసిన చాలామంది నెటిజన్స్.. మలయాళ సూపర్ హిట్ సినిమా మాలికపురం రీమేక్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఉన్ని ముకుందన్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రానికి విష్ణు శశి శంకర్ దర్శకత్వం వహించాడు. 2022 లో రిలీజైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. చైల్డ్ ఆర్టిస్ట్ దేవ నంద ఈ చిత్రం ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకుంది.

మాలికపురం కథ విషయానికొస్తే.. ఎనిమిదేళ్ల కళ్యాణి(దేవ నంద) అయ్యప్ప భక్తురాలు. తండ్రితో పాటు శబరిమల వెళ్ళాలి అనేది ఆమె కోరిక. కానీ, తండ్రి అప్పుల బాధ భరించలేక ఆత్మహత్య చేసుకుంటాడు. దీంతో తన స్నేహితుడితో కలిసి కళ్యాణి శబరిమల వెళ్తుంది. మధ్యలో వీరిద్దరిని కిడ్నప్ చేయాలనీ ఒక రౌడీ ప్రయత్నిస్తాడు. ఇక వీరిని జాగ్రత్తగా శబరిమల చేర్చడానికి అయ్యప్పన్ (ఉన్ని ముకుందన్) సహాయం చేస్తాడు. అసలు అయ్యప్పన్ ఎవరు.. ? చిన్నారులిద్దరూ తిరిగి ఇంటికి చేరుకున్నారా.. ? లేదా.. ? అనేది కథ. ఇక ఇదే కథతో రవితేజ ఇరుముడి చేస్తున్నాడని అంటున్నారు. అయ్యప్ప స్వామిగా రవితేజ కనిపిస్తాడని అంటున్నారు. శివ నిర్వాణ ఇదే కథను తెలుగు నేటివిటీకి దగ్గరగా తీయనున్నాడని టాక్. ఈ విషయం తెలియడంతో నిజమేనా.. రవన్న అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇందులో ఎంత నిజముంది అనేది తెలియాలంటే సినిమా వచ్చేవరకు ఆగాల్సిందే.

Updated Date - Jan 26 , 2026 | 05:30 PM