సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Ustaad Bhagat Singh: ఉస్తాద్ లో అది లేదా.. అయితే కష్టమే

ABN, Publish Date - Feb 03 , 2026 | 07:48 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా హరీశ్ శంకర్ (Harish Shankar) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh).

Ustaad Bhagat Singh

Ustaad Bhagat Singh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా హరీశ్ శంకర్ (Harish Shankar) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh). మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రంలో రాశీ ఖన్నా (Raashii Khanna), శ్రీలీల (Sreeleela) హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకొంటున్న ఉస్తాద్ భగత్ సింగ్ మార్చిలో రిలీజ్ కానుందని సమాచారం. ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. తమిళ్ లో సూపర్ హిట్ అయిన తేరి సినిమా లైన్ ని తీసుకొని హరీశ్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

ఇక హరీశ్ - పవన్ కాంబోలో ఇప్పటికే గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా వచ్చింది. పవన్ కెరీర్ లోనే ఆ సినిమా మైలురాయిగా నిలిచింది. అందులోని ప్రతి సాంగ్ చార్ట్ బస్టర్. ముఖ్యంగా కెవ్వు కేక.. ఐటెంసాంగ్స్ లోనే ది బెస్ట్ గా నిలిచింది. అలాంటి కాంబో రీపీట్ అవుతోంది అనగానే ఫ్యాన్స్ కూడా కెవ్వు కేక లాంటి మరో ఐటెంసాంగ్ రాబోతుందని అంచనాలు పెట్టుకున్నారు. కానీ, ఈసారి మాత్రం ఫ్యాన్స్ కు నిరాశనే మిగిలింది. ఉస్తాద్ లో ఐటెంసాంగ్ లేదు అని హరీశ్ అధికారికంగా తెలిపారు.

తాజాగా హరీశ్ సాంగ్ ఉస్తాద్ లో ఐటెంసాంగ్ లేదని, కానీ, ప్రతి సాంగ్ స్పెషల్ ఐటెం అని పోస్ట్ చేశారు. దీంతో ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. పవన్ సినిమాల్లో ఐటెంసాంగ్స్ చాలా పాపులర్. ఖుషీ దగ్గర నుంచి మొన్నీమధ్య వచ్చిన ఓజీ వరకు ప్రతి సినిమాలో స్టార్ హీరోయిన్ తో ఒక ఐటెంసాంగ్ ఉంటుంది. ఓజీలో రాధిక నేహా శెట్టి ఆడిపాడింది. ఉస్తాద్ లో ఇంకే స్టార్ హీరోయిన్ ని దింపుతారో అని ఎదురుచూస్తుంటే అసలు ఐటెంసాంగ్ లేదు అని తెలియడంతో ఫ్యాన్స్ నిరాశను వ్యక్తం చేస్తున్నారు. పవన్ - హరీశ్ - దేవిశ్రీప్రసాద్ కాంబోలో ఐటెంసాంగ్ లేకపోతే కష్టమే అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి గబ్బర్ సింగ్ మ్యాజిక్ ను ఉస్తాద్ భగత్ సింగ్ రిపీట్ చేస్తుందా.. ? లేదా.. ? అనేది చూడాలి.

Updated Date - Feb 03 , 2026 | 07:49 PM