సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Idupu Kayitham: అప్పుడు పేరు.. ఇప్పుడు ‘శ్రీలత’ ప్రోమోతో అద‌ర‌గొట్టారుగా

ABN, Publish Date - Aug 25 , 2026 | 08:33 PM

విభిన్న కథాంశాలతో ప్రేక్షకులను అలరిస్తున్న నటుడు ప్రియదర్శి మరో ఆసక్తికర ప్రాజెక్ట్‌తో రాబోతున్న విష‌యం తెలిసిందే.

Idupu Kayitham

విభిన్న కథాంశాలతో ప్రేక్షకులను అలరిస్తున్న నటుడు ప్రియదర్శి (Priyadarshi) మరో ఆసక్తికర ప్రాజెక్ట్‌తో రాబోతున్నారు. ఫోక్ సింగర్‌గా గుర్తింపు తెచ్చుకున్న నాగ దుర్గ (Naga Durga) హీరోయిన్‌గా నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘ఇడుపు కాగితం’ (Idupu Kayitham) నుంచి తొలి పాటకు సంబంధించిన ప్రోమో విడుదలై మంచి స్పందనను అందుకుంటోంది. మంగ‌ళ‌వారం ప్రియ‌ద‌ర్శి జ‌న్మ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని ప్ర‌త్యేకంగా ‘శ్రీలత’ పేరుతో విడుదలైన ఈ ఫస్ట్ సింగిల్ ప్రోమోలో ప్రేమ, అనురాగం వంటి భావోద్వేగాలను ఆవిష్కరించే ప్రయత్నం స్ప‌ష్టంగా కనిపిస్తోంది. “ఓ శ్రీలత.. ఈ శ్రీనివాసుడే నీ జత” అనే లైన్స్‌తో సాగిన ఈ ప్రోమో మెలోడీ లవర్స్‌ను వెంటనే ఆకర్షిస్తోంది. ముఖ్యంగా ప్రియదర్శి, నాగ దుర్గ మధ్య కనిపించిన సహజమైన కెమిస్ట్రీ పాటకు మరింత అందాన్ని తీసుకొచ్చింది.

సంగీత దర్శకుడు సురేష్ బొబ్బిలి (Suresh Bobbili)స్వరపరిచిన ఈ గీతం పూర్తి వెర్షన్‌పై ఇప్పటికే ఆసక్తిని పెంచేసింది. ప్రోమోలో వినిపించిన ట్యూన్ వినసొంపుగా ఉండటంతో సోషల్ మీడియాలో కూడా మంచి స్పందన లభిస్తోంది. విడుదలకు ముందే ఈ పాట మ్యూజిక్ లవర్స్ ప్లేలిస్ట్‌లో చోటు దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. సుకుమార్ రైటింగ్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్లపై రూపొందుతున్న ఈ చిత్రాన్ని బన్నీ వాస్, తబితా సుకుమార్ నిర్మిస్తున్నారు. యువ దర్శకుడు వంశీ రెడ్డి దొండపాటి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. కథలో కీలక పాత్రల్లో అభినవ్ గోమఠం, శివజ్యోతి, వీ6 సుజాత, మౌనికా రెడ్డి నటిస్తున్నారు. ఇప్పటికే టైటిల్‌తోనే రెండు తెలుగు రాష్ట్రాల‌లో వీప‌రాత‌మైన‌ ఆసక్తి రేకెత్తించిన ‘ఇడుపు కాగితం’ సినిమా, ఇప్పుడు ‘శ్రీలత’ పాట ప్రోమోతో మరింత చర్చనీయాంశంగా మారింది. పూర్తి పాట విడుదలైన తర్వాత ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.

Updated Date - Aug 25 , 2026 | 08:33 PM