‘ది వరల్డ్ ఆఫ్ రావు బహదూర్’.. బీటీఎస్ వీడియో చూశారా?
ABN, Publish Date - May 22 , 2026 | 10:18 PM
వెంకటేష్ మహా దర్శకత్వంలో, వెర్సటైల్ యాక్టర్ సత్యదేవ్ హీరోగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ సైకాలజికల్ థ్రిల్లర్ చిత్రం ‘రావు బహదూర్’. తాజాగా ఈ మూవీ నుంచి ‘ఇన్ టూ ది వరల్డ్ ఆఫ్ రావు బహదూర్’ పేరుతో మేకర్స్ ఓ బీటీఎస్ వీడియోను విడుదల చేశారు.
సూపర్‌స్టార్ మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్‌లకు చెందిన జిఎంబి ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పణలో.. వెంకటేష్ మహా (Venkatesh Maha) దర్శకత్వంలో, వెర్సటైల్ యాక్టర్ సత్యదేవ్ హీరోగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ సైకాలజికల్ థ్రిల్లర్ చిత్రం ‘రావు బహదూర్’ (Rao Bahadur). వెంకటేష్ మహా ఈ చిత్రానికి దర్శకత్వం వహించడమే కాకుండా కథ, ఎడిటింగ్ బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నారు. ఏ+ఎస్ మూవీస్, శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్, ‘ఓ సుందరి’ సాంగ్ మంచి స్పందనను రాబట్టుకుని.. సినిమాపై ఆసక్తిని మరింత పెంచాయి. తాజాగా మేకర్స్ ‘ఇన్ టూ ది వరల్డ్ ఆఫ్ రావు బహదూర్’ (Into The World Of Rao Bahadur) పేరుతో ఓ బీటీఎస్ వీడియోను విడుదల చేశారు.
ఈ వీడియోలో చిత్ర నిర్మాణ వైభవం, ప్రీ-ప్రొడక్షన్ పనులు, ప్రోస్తెటిక్ మేకప్, భారీ సెట్స్, షూటింగ్ విశేషాలను చూపిస్తూ.. ఈ సినిమా ఏ రేంజ్‌లో ఉంటుందో తెలియజేశారు. ఈ సినిమా విజువల్‌గా ఒక గొప్ప సినిమాటిక్ అనుభవాన్ని అందించబోతోందనే సంకేతాలు ఈ వీడియోను చూస్తుంటే తెలుస్తున్నాయి. ఇందులో ప్రధాన ఆకర్షణగా సత్యదేవ్ ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్ నిలుస్తోంది. సెట్స్‌కు వచ్చిన తర్వాత ఆయన ప్రత్యేక మేకప్, స్టైలింగ్ ప్రక్రియలో పాల్గొనే విధానాన్ని ఇందులో చూపించారు. వయసు మీద పడిన రాజరిక పాత్ర కోసం బాల్డ్ క్యాప్, ప్రత్యేక ప్రోస్తెటిక్స్, పొడవాటి తెల్లజుట్టు, దట్టమైన గడ్డం, మెలితిరిగిన మీసాలతో ఆయన ట్రాన్స్‌ఫర్మేషన్ అయ్యారు.
ప్రత్యేక కాంటాక్ట్ లెన్సులు, గ్రాండ్‌గా డిజైన్ చేసిన షేర్వాణీ, ముత్యాల హారాలు, సంప్రదాయ తలపాగా వంటి గెటప్‌తో నిజంగానే సత్యదేవ్ రాజవంశీయుడి హుందాతనాన్ని ప్రదర్శించారు. సినిమాలో ఆయన విభిన్న లుక్స్‌ను కూడా ఈ వీడియోలో చూపించడం విశేషం. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. దీపా థామస్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీలో వికాస్ ముప్పాల, బాల పరాసర్, ఆనంద్ భారతి, ప్రణయ్ వాకా, మాస్టర్ కిరణ్ వంటి వారు ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
ఇవి కూడా చదవండి:
MEGA158: ‘దట్స్ ఇట్.. ద బ్లడీ బెంచ్ మార్క్’.. టైటిల్ లీక్ చేసేస్తా!
అసలు చరణ్ - ఎన్టీఆర్ మధ్య ఏం జరుగుతోంది?