ఇండియా మొత్తం మాట్లాడుకునే గొప్ప సినిమా 'బైకర్'
ABN, Publish Date - Mar 23 , 2026 | 08:13 AM
'మొన్న చెప్పి 'నారీ నారీ నడుమ మురారీ'తో హిట్ కొట్టాను. ఇప్పుడు 'బైకర్'తో బంపర్ బ్లాక్‌బస్టర్ కొడుతున్నాం. ఇండియా మొత్తం మాట్లాడుకునే గొప్ప సినిమా తీశాం' అని అన్నారు శర్వానంద్.
'బైకర్ (BIKER) సినిమా గురించి ఒకటే మాట చెప్తాను. మొన్న చెప్పి 'నారీ నారీ నడుమ మురారీ'తో హిట్ కొట్టాను ఇప్పుడు మళ్లీ చెప్తున్నాను. ఈసారి బైకర్‌తో బంపర్ బ్లాక్‌బస్టర్ కొడుతున్నాం. ఇండియా మొత్తం మాట్లాడుకునే గొప్ప సినిమా తీశాం' అని అన్నారు శర్వానంద్ (Sharwanand).
ఆయన కథానాయకుడిగా అభిలాష్ రెడ్డి కంకర (Abhilash Reddy) తెరకెక్కించిన చిత్రమిది. మాళవిక నాయర్ (Malvika Nair) హీరోయిన్. రాజశేఖర్ (Rajashekhar) కీలక పాత్ర పోషించారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ- ప్రమోద్ నిర్మించారు. ఏప్రిల్ 3న సినిమా విడుదలవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ ట్రైలర్ విడుదల చేశారు.
ఇండియన్ రేసర్లు ప్రపంచస్థాయి ప్రతిభావంతులతో సమానంగా నిలబడగలరా? అని ఒక విదేశీ స్పోర్ట్స్ యాంకర్ ప్రశ్నించడంతో ట్రైలర్ ప్రారంభం అవుతుంది. బైక్ రేసింగ్‌లో గుర్తింపు కోసం తండ్రీ కొడుకులు ఏం చేశారనే దాని చుట్టూ కథ సాగుతుందని అర్థమవుతోంది. ట్రైలర్‌లో బైక్ రేసింగ్ సన్నివేశాలు హాలీవుడ్ స్థాయిలో ఉన్నాయి. 'నువ్వు అందరి కంటే ముందు రాలేదు. నీ కంటే అందరూ వెనకాల వచ్చారు' అంటూ రాజశేఖర్ చెప్పే డైలాగులు ఆకట్టుకున్నాయి.
ఈ కార్యక్రమంలో నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ 'కచ్చితంగా ఈ సినిమా సూపర్ హిట్ అవుతుంది. తండ్రీ కొడుల మధ్య భావోద్వేగం అద్భుతంగా ఉంది' అని అన్నారు. చిత్ర దర్శకుడు అభిలాష్, నటుడు రాజశేఖర్, నిర్మాత బన్నీ వాసు, హీరోయిన్ మాళవిక నాయర్ తదితరులు పాల్గొన్నారు.