Vishwanath and Sons: సూర్య పాడిన వెడ్డింగ్ సాంగ్ వచ్చేసింది
ABN, Publish Date - Jul 25 , 2026 | 06:33 PM
కోలీవుడ్ స్టార్ సూర్య (Suriya), బ్యూటిఫుల్ హీరోయిన్ మమితా బైజు (Mamitha Baiju) కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం విశ్వనాథ్ అండ్ సన్స్ (Vishwanath and Sons).
కోలీవుడ్ స్టార్ సూర్య (Suriya), బ్యూటిఫుల్ హీరోయిన్ మమితా బైజు (Mamitha Baiju) కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం విశ్వనాథ్ అండ్ సన్స్ (Vishwanath and Sons). బ్లాక్‌బస్టర్ హిట్ దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ నిర్మించాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆగస్టు 14 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడడంతో మేకర్స్ ప్రమోషన్స్ స్పీడు పెంచేశారు.
తాజాగా ఈ సినిమా నుంచి ది వెడ్డింగ్ సాంగ్ లిరికల్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. సాంగ్ ఆద్యంతం ఆకట్టుకొంటుంది. ఈ పాటలో సూర్య సరికొత్త వింటేజ్ గ్లామరస్ లుక్‌తో కనిపించి ఫ్యాన్స్ ను ఖుషీ చేశాడు. మ్యూజిక్ సెన్సేషన్ జి. వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ఈ ఫుట్-ట్యాపింగ్ డాన్స్ నంబర్ వినగానే పాదాలు కలపకుండా ఉండలేం. అంతేకాకుండా, ఈ పాటలో స్వయంగా సూర్య పాడిన ఎనర్జిటిక్ వోకల్స్, ఆయన ఎనర్జిటిక్ డాన్స్ మూమెంట్స్ పాటకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. స్క్రీన్ పై మమితా బైజుతో కలిసి సూర్య చేసిన డాన్స్ విజువల్స్,రామజోగయ్య శాస్త్రి అందించిన క్యాచీ బీట్స్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటూ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
పక్కా వెడ్డింగ్ యాంథమ్ గా ఈ సాంగ్ ఉందని విజువల్స్ బట్టి తెలుస్తోంది. ఇక ప్రతి పెళ్లిలో ఈ సాంగ్ కూడా ప్లే అవుతోందని చెప్పొచ్చు. 40 ఏళ్ల వ్యక్తికి.. 20 ఏళ్ల అమ్మాయికి మధ్య జరిగిన ప్రేమకథనే విశ్వనాథ్ అండ్ సన్స్. ఈ సినిమాపై సూర్య చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమాలో రవీనా టాండన్ ఒక కీలక పాత్రలో నటిస్తుంది. మరి ఈ సినిమాతో సూర్య ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.