సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

NTR: యన్టీఆర్ కి అస్వస్థత.. డ్రాగన్ కి బ్రేక్

ABN, Publish Date - Jan 21 , 2026 | 05:21 PM

యంగ్ టైగర్ యన్టీఆర్ (NTR) నటించిన 'దేవర' తరువాత వచ్చిన 'వార్ 2' ఫ్యాన్స్ ను తీవ్ర నిరాశకు గురి చేసింది. దాంతో యన్టీఆర్ అభిమానులు రాబోయే సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

NTR

NTR: యంగ్ టైగర్ యన్టీఆర్ (NTR) నటించిన 'దేవర' తరువాత వచ్చిన 'వార్ 2' ఫ్యాన్స్ ను తీవ్ర నిరాశకు గురి చేసింది. దాంతో యన్టీఆర్ అభిమానులు రాబోయే సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రశాంత్ నీల్ (Prashanth Neel)దర్శకత్వంలో యన్టీఆర్ హీరోగా రూపొందుతోన్న సినిమాపై ఫ్యాన్స్ బోలెడు ఆశలు పెట్టుకున్నారు. గతంలో ప్రశాంత్ తెరకెక్కించిన 'కేజీఎఫ్' రెండు భాగాలు, ప్రభాస్ తో రూపొందించిన 'సలార్-1' చిత్రాలు ప్రేక్షకులను విశేషంగా అలరించాయి. అందువల్ల తమ హీరో యన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ తీసే సినిమా సైతం ఘనవిజయం సాధిస్తుందని ఫ్యాన్స్ నమ్మకం. ఈ సినిమాకు 'డ్రాగన్' అనే టైటిల్ చాలా రోజులుగా వినిపిస్తోంది కానీ, ఇంకా దీనిపై అధికార ప్రకటన వెలువడలేదు. అయితే ఈ సినిమా కోసం భారీ యాక్షన్ సీన్స్ ను ఈ మధ్య తెరకెక్కించారు. ఏకధాటిగా షూటింగ్ సాగింది. అయితే ఉన్నట్టుండి బ్రేక్ పడింది.

యన్టీఆర్ తో భారీ యాక్షన్ ఎపిసోడ్ ప్లాన్ చేశారు ప్రశాంత్ నీల్. దానికి సంబంధించిన షూటింగ్ కంటిన్యూయస్ గా జరిగింది. ఈ చిత్రీకరణ సమయంలోనే యన్టీఆర్ అస్వస్థతకు గురయ్యారు. కంటిన్యూగా షూటింగ్ లో పాలుపంచుకోవడం వల్ల, వాతావరణం సరిగా లేక యన్టీఆర్ కు అనారోగ్యం వాటిల్లిందని యూనిట్ మెంబర్స్ చెబుతున్నారు. అందువల్ల హీరో రెస్ట్ తీసుకున్నాకే షూటింగ్ ఆరంభిద్దామని డైరెక్టర్ నీల్ నిర్ణయించడంతో బ్రేక్ పడింది... అయితే ఫ్యాన్స్ ఆందోళన చెందవలసిన పనిలేదని, రెస్ట్ లెస్ నెస్ వల్ల యన్టీఆర్ కు అస్వస్థత కలిగిందని అంటున్నారు. ఆయన కోలుకోగానే మళ్ళీ షూటింగ్ యథాతథంగా సాగుతుందని తెలుస్తోంది.

యన్టీఆర్ - నీల్ కాంబోలో తెరకెక్కుతోన్న చిత్రంలో రుక్మిణీ వసంత్ నాయికగా నటిస్తోంది. అత్యంత భారీ వ్యయంతో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని జూన్ 26న విడుదల చేసేందుకు ప్లాన్ చేశారు. అయితే ప్రస్తుతం గ్యాప్ రావడంతో షెడ్యూల్స్ లో మార్పు అనివార్యం. ఏది ఏమైనా ఈ చిత్రం ఈ సంవత్సరమే వెలుగు చూస్తుందని తెలుస్తోంది. ఈ మూవీతో తప్పకుండా యన్టీఆర్ ఓ బిగ్ హిట్ ను పట్టేస్తారని అభిమానులు ఆశిస్తున్నారు. మరి ఈ చిత్రం ఏ టైటిల్ తో ఎప్పుడు ఎలా జనం ముందుకు వస్తుందో చూడాలి.

Updated Date - Jan 21 , 2026 | 05:21 PM