Upasana Konidela: సరోగసీ ద్వారా బిడ్డను కంటున్న మెగా కోడలు.. అసలు నిజం ఇదే
ABN, Publish Date - Jan 06 , 2026 | 04:53 PM
తాజాగా మెగా కోడలు ఉపాసన కొణిదెల (Upasana Konidela) సరోగసీ ద్వారా తల్లి కాబోతుందని కొన్నిరోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి.
Upasana Konidela: సెలబ్రిటీల మీద సోషల్ మీడియాలో రూమర్స్ రావడం చాలా సహజం. అందులో నిజం ఉందో లేదో కూడా తెలియదు కానీ, ఏవ్ నిజమని ప్రచారం చేస్తూ ఉంటారు. తాజాగా మెగా కోడలు ఉపాసన కొణిదెల (Upasana Konidela) సరోగసీ ద్వారా తల్లి కాబోతుందని కొన్నిరోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan)- ఉపాసన పెళ్లి అయిన పదేళ్లకు క్లింకార జన్మించింది. అప్పుడు కూడా సరోగసీ ద్వారానే బిడ్డకు జన్మనిస్తుందని వార్తలు వచ్చాయి. ఆ తరువాత ఉపాసన బేబీ బంప్ తో కనిపించేసరికి నిజంగా ఆమె ప్రెగ్నెంట్ అని నమ్మారు.
క్లింకారకు మూడేళ్లు వచ్చాయి. రెండోసారి ఉపాసన ప్రెగ్నెంట్ అయ్యింది. ఇంట్లో ఘనంగా సీమంతం చేసి మెగా ఫ్యామిలీ ఈ విషయాన్నీ అధికారికంగా అభిమానులకు తెలిపారు. అంతేకాకుండా ఈసారి ఉపాసన కవల పిల్లలకు జన్మనిస్తుందని కూడా చెప్పారు. సీమంతం తరువాత నుంచి ఉపాసన మీడియా ముందు ఎక్కువగా కనిపించలేదు. దీంతో చరణ్ - ఉపాసన ఈ ట్విన్స్ ని సరోగసీ ద్వారా కంటున్నారు. అందుకే బయటకు రావడం లేదు అంటూ రూమర్స్ పుట్టించారు.
అయితే ఈ రూమర్స్ కి మెగా ఫ్యామిలీ చెక్ పెట్టింది. తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఇంటికి ప్రముఖ జపనీస్ చెఫ్ అసవా తకమాసాను చరణ్ ఆహ్వానించడం జరిగింది. ఆయన ప్రత్యేకంగా బిర్యానీ వండి మరీ ఆ కుటుంబ సభ్యులకు తన చేతివంటను రుచి చూపించాడు. ఆ వంటకు చరణ్ ఒక్కడే కాదు.. ఫ్యామిలీ మొత్తం ఫిదా అయ్యింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ఈ వీడియోస్ లో ఉపాసన బేబీ బంప్ తో దర్శనమిచ్చింది. బేబీ బంప్ తోనే బిర్యానీ తింటూ కనిపించింది. దీంతో ఉపాసన నిజంగానే ప్రెగ్నెంట్ అయ్యిందని, సరోగసీ అని వస్తున్న వార్తలో నిజం లేదని క్లారిటీ వచ్చిన్నట్లే. త్వరలోనే మెగాఫ్యామిలీలోకి ట్విన్స్ రాబోతున్నారు. మరి ఈసారి అయినా మెగా వారసుడు అడుగుపెడతాడేమో చూడాలి.