సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Pongal Movies: రీమిక్స్ ట్రెండ్.. అంతా కిరణ్ అబ్బవరం మాయ

ABN, Publish Date - Jan 15 , 2026 | 05:50 PM

ఆ మధ్య వచ్చిన యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) 'కె-ర్యాంప్ (K Ramp)'లో ఓ నాటి రాజశేఖర్ 'ఆయుధం' చిత్రంలోని "ఇదేమిటమ్మా... మాయ మాయ..." సాంగ్ ను రీమిక్స్ చేశారు...

Pongal Movies

Pongal Movies: ఆ మధ్య వచ్చిన యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) 'కె-ర్యాంప్ (K Ramp)'లో ఓ నాటి రాజశేఖర్ 'ఆయుధం' చిత్రంలోని "ఇదేమిటమ్మా... మాయ మాయ..." సాంగ్ ను రీమిక్స్ చేశారు... ఆ పాట 'కె-ర్యాంప్' రిలీజ్ కు ముందే భలే పాపులర్ అయింది. చిత్రమేంటంటే ఈ సాంగ్ కారణంగా అప్పటి రాజశేఖర్ పాటను జనం తెగ చూశారు... అంటే రీమిక్స్ కారణంగా ఒరిజినల్ కు క్రేజ్ వచ్చిందన్న మాట... తెలుగు చిత్రాల్లో రీమిక్స్ సాంగ్స్ కొత్తేమీ కాదు... అయితే పాతదై పోయిన ఆ ట్రెండ్ ను మళ్ళీ పట్టుకు వచ్చి సినీజనానికి అలవాటు చేసిన క్రెడిట్ ను యంగ్ హీరో కిరణ్ అబ్బవరంకు ఇస్తున్నారు పరిశీలకులు.

'కె-ర్యాంప్' కారణంగానే సంక్రాంతి బరిలో దూకిన నాలుగు చిత్రాల్లో రీమిక్స్ సాంగ్స్ ఉన్నాయని తెలుస్తోంది... ప్రభాస్ 'ద రాజాసాబ్'లోని ఓ నాటి మిథున్ చక్రవర్తి 'డిస్కో డాన్సర్'లోని "కోయి యహా నాచే నాచే..." సాంగ్ ను రీమిక్స్ చేశారు... తరువాత వచ్చిన చిరంజీవి 'మన శంకరవరప్రసాద్ గారు'లోనూ ఇళయరాజా స్వరకల్పనలో రూపొందిన రజనీకాంత్ 'దళపతి'లోని 'సుందరీ...' అంటూ సాగే పాటను మూడు భాషల్లోనూ వినిపించడం విశేషం.

రవితేజ హీరోగా రూపొందిన 'భర్త మహాశయులకు విజ్ఞప్తి'లోనూ ఓ పాట రీమిక్స్ గానే తెరకెక్కింది... 1979 నాటి శోభన్ బాబు 'కార్తికదీపం'లోని "ఆరనీకుమా ఈ దీపం..." సాంగ్ ను రీమిక్స్ చేసి ఉపయోగించుకున్నారు... ఈ పాటకు డీజే మిక్స్ చేసి రూపొందించడం దానికి హీరో రవితేజ స్టెప్పేయడం గమనార్హం!... అలాగే శోభన్ బాబు 'దేవత' చిత్రంలోని సూపర్ హిట్ సాంగ్ 'వెల్లువొచ్చి గోదారమ్మా..." సాంగ్ కు కమెడియన్ సత్య చేత డాన్స్ చేయించారు... ఈ రెండూ శోభన్ బాబు మూవీ సాంగ్స్ కావడం విశేషం.

సంక్రాంతి సందడిలోనే పాలు పంచుకున్న నవీన్ పోలిశెట్టి 'అనగనగా ఒకరాజు' మూవీలో కూడా ఓ పాత పాట చోటు చేసుకుంది... వెంకటేశ్ సూపర్ హిట్ మూవీ 'బొబ్బిలిరాజా'లోని ఇళయరాజా కంపోజింగ్ సూపర్ సాంగ్ "బలపం పట్టి భామ బళ్ళో..." సాంగ్ ను అనువుగా ఉపయోగించుకున్నారు. ఇక నారీ నారీ నడుమ మురారి సినిమాలో కూడా రీమిక్స్ ఉపయోగించారు. కానీ, దాన్ని ప్రమోషన్ కి మాత్రమే అంకితం చేశారు. నందమూరి బాలకృష్ణ హిట్ సినిమా టైటిల్ ని తీసుకున్న శర్వా.. అందులో మరింత హిట్ అయిన ఇరువురు భామల కౌగిలిలో సాంగ్ ను రీ క్రియేట్ చేశాడు. ఆ సాంగ్ కూడా సినిమాకు ప్లస్ అయ్యింది.

మొత్తానికి ఈ సారి పండగకు వచ్చిన సినిమాల్లో సింహభాగం రీమిక్స్ సాంగ్స్ తో సాగడం విశేషం... ఏది ఏమైనా ఈ రీమిక్స్ ట్రెండ్ కు మళ్ళీ ఊపు తెచ్చింది మాత్రం కిరణ్ అబ్బవరం అంటూ పరిశీలకులు డిక్లేర్ చేశారు... మరి ఈ రూటులో ఇంకా ఎంతమంది సాగుతారో? ఏ తీరున జనాన్ని అలరిస్తారో చూడాలి.

Updated Date - Jan 15 , 2026 | 05:56 PM