సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

‘ది రెడ్ బ్యాగ్’.. టీజర్

ABN, Publish Date - Jun 22 , 2026 | 07:42 PM

మంత్రి టీజీ భరత్ చేతుల మీదుగా ‘ది రెడ్ బ్యాగ్’ టీజర్ విడుదలైంది. నలుగురు యువతుల జీవితాలను మార్చేసే ఓ రెడ్ బ్యాగ్ చుట్టూ సాగే ఈ థ్రిల్లర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది.

The Red Bag

మెమరీ మేకర్స్ బ్యానర్ మీద హరికృష్ణ సోమిశెట్టి నిర్మించిన చిత్రం ‘ది రెడ్ బ్యాగ్’. ఈ మూవీకి రవి కుమార్ సీరపు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో కబీర్ సింగ్, ప్రసాద్ బెహరా, రాధ్య, మోనిక, స్నేహా సింగ్, ఆకాంక్ష, ఈషాన్ శంకర్, అవినాష్ బాదల్, భార్గవి, రాశీ తదితరులు ముఖ్య పాత్రలను పోషించారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన ప్రతీ కంటెంట్ సినిమాపై ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేశాయి. ఆదివారం నాడు ‘ది రెడ్ బ్యాగ్’ టీజర్‌ను ఏపీ ఇండస్ట్రీస్, కామర్స్, ఫుడ్ ప్రాసెసింగ్ మినిస్టర్ టీజీ భరత్ రిలీజ్ చేశారు.

‘లైఫ్‌లో ఇన్వైట్ చేయని గెస్టులు చాలా మంది వస్తుంటారు.. వచ్చి మన లైఫ్‌ని మార్చేస్తారు.. ఆ గెస్ట్ మనిషే అవ్వాల్సిన అవసరం లేదు.. మనల్ని పరుగెత్తించి, ఇబ్బంది పెట్టి చావు వరకు తీసుకెళ్లి వదిలిపెట్టే ఆ పిలవని అతిథి’ అనే వాయిస్ ఓవర్‌లో టీజర్ ఎంతో ఇంట్రెస్టింగ్‌గా సాగుతుంది. నలుగురు అమ్మాయిల జీవితం ఓ రెడ్ బ్యాగ్ వల్ల తలకిందులు అవుతున్నట్టుగా చూపిస్తున్నారు. అసలు ఆ రెడ్ బ్యాగ్‌లో ఏముంది? అమ్మాయిలకి ఆ బ్యాగ్‌కి ఉన్న సంబంధం ఏంటి? ఆ రెడ్ బ్యాగ్‌తో మాఫియాకి ఉన్న లింక్ ఏంటి? అనే ఆసక్తికరమైన ప్రశ్నలు తలెత్తేలా టీజర్‌ను అద్భుతంగా కట్ చేశారు.

ఇక ఈ టీజర్‌లోని విజువల్స్, కట్స్, యాక్షన్ సీక్వెన్స్, ఆర్ఆర్ అదనపు ఆకర్షణ అని చెప్పుకోవచ్చు. హై స్టాండర్డ్‌లో కనిపిస్తున్న ఈ టీజర్ ఒక్కసారిగా అంచనాలు పెంచేసింది. చివర్లో డైలాగ్స్ ఏమీ చెప్పకుండా రాశీ ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్‌ హైలెట్‌గా నిలిచింది. ఇక నలుగురు హీరోయిన్స్ ఎంత గ్లామరస్‌గా కనిపిస్తున్నారో.. అంత వయలెంట్‌గా తెరరపై విధ్వంసం చేసినట్టు అనిపిస్తోంది. ఈ సినిమాకి శేఖర్ మోపురి సంగీతం, ప్రియేష్ గురుస్వామి కెమెరా వర్క్, శివ శర్వాణి ఎడిటింగ్ బాధ్యతల్ని నిర్వర్తించారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు.

Updated Date - Jun 22 , 2026 | 07:42 PM