యాక్షన్ లవర్స్‌కి ట్రీట్ ఇచ్చేలా ‘ది రెడ్ బ్యాగ్’.. అప్డేట్ ఇదే!

ABN , Publish Date - May 02 , 2026 | 08:46 PM

డిఫరెంట్ కాన్సెప్ట్, కంటెంట్‌తో నూతన నిర్మాత హరికృష్ణ సోమిశెట్టి నిర్మిస్తోన్న చిత్రం ‘ది రెడ్ బ్యాగ్’. ఓ బ్యాగ్ చుట్టూ తిరిగే కథతో రవి కుమార్ సీరపు తెరకెక్కిస్తున్నారు.

The Red Bag Movie Update

డిఫరెంట్ కాన్సెప్ట్, కంటెంట్‌తో నూతన నిర్మాత హరికృష్ణ సోమిశెట్టి (Hari Krishna Somisetty) నిర్మిస్తోన్న చిత్రం ‘ది రెడ్ బ్యాగ్’ (The Red Bag). ఓ బ్యాగ్ చుట్టూ తిరిగే కథతో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రానికి రవి కుమార్ సీరపు (Ravi Kumar Seerapu) కథ, కథనం, దర్శకత్వ బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నారు. తాజాగా ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన అప్డేట్‌ని మేకర్స్ తెలియజేశారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ మొత్తం పూర్తి చేసుకుందని, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయని మేకర్స్ ఈ అప్డేట్‌ (The Red Bag Movie Update)లో తెలిపారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్.. సినిమాపై మంచి ఆసక్తిని రేకెత్తించిన విషయం తెలిసిందే.


ఈ మూవీ కాన్సెప్ట్ పోస్టర్‌లో ఇచ్చిన డీటైల్స్, వదిలిన హింట్స్‌తో సినిమాపై భారీగా బజ్ క్రియేట్ అయ్యేలా చేశారు. చేతినిండా రక్తంతో బ్యాగుని పట్టుకున్న తీరు, పోస్టర్‌లో ఉన్న కత్తులు, గన్నులు, రక్తంతో నిండిన ఆ ప్రాంతం.. ఇలా అన్నింటిని చూస్తే, ఈ సినిమా యాక్షన్ లవర్స్‌కి ట్రీట్ ఇచ్చేలా ఉండబోతోందనేది అర్థమవుతోంది. రీసెంట్‌గా థాయ్‌లాండ్‌లో సినిమా టీమ్ కీలక సన్నివేశాలను, ఓ పాటను షూట్ చేసినట్లుగా తెలిపారు. థాయ్‌లాండ్‌లోని అందమైన లొకేషన్లలో చిత్రీకరించిన ఈ సీన్స్ సినిమాకి హైలెట్‌గా నిలవనున్నాయని టీమ్ వెల్లడించింది.


కబీర్ సింగ్ ఇంత వరకు పోషించని ఓ డిఫరెంట్ పాత్రలో ఈ సినిమాలో కనిపించనున్నారు. ఆయనతో పాటు ప్రసాద్ బెహరా, రాధ్య, మోనిక, స్నేహా సింగ్, ఆకాంక్ష, ఈషాన్ శంకర్, అవినాష్ బదల్, భార్గవి వంటి వారు ఇతర కీలక పాత్రలలో కనిపించనున్నారు. త్వరలోనే ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం టీజర్‌ రెడీగా ఉందని, అతి త్వరలోనే విడుదల చేస్తామని మేకర్స్ తెలుపుతున్నారు. నిర్మాత హరికృష్ణ సోమిశెట్టికి తొలి సినిమానే అయినా, ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి:

పవన్ కళ్యాణ్ నివాసానికి సీఎం చంద్రబాబు.. ఫొటోలు వైరల్!

‘నా పెళ్ళాం నిప్పు రా’.. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పోస్ట్ వైరల్!

తొక్కలో ఇంటర్వ్యూ.. అంటూ కుర్చీ విసిరేసి వెళ్లిపోయిన గెటప్ శ్రీను!

కయాదు లోహర్‌ గురించి ఈ విషయాలు తెలుసా?

Updated Date - May 02 , 2026 | 08:46 PM