సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Rajasekhar: శ్రీదేవిని కాదని జీవితతో పెళ్ళి.. ఎలా జరిగిందంటే

ABN, Publish Date - May 03 , 2026 | 03:02 PM

యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ (Rajasekhar) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్ లో ఆయనకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది.

Rajasekhar

Rajasekhar: యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ (Rajasekhar) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్ లో ఆయనకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. హీరోగా ఎన్నో మంచి సినిమాలు చేసిన రాజశేఖర్ ప్రస్తుతం సపోర్టింగ్ రోల్స్ చేస్తూ బిజీగా మారారు. ఈ మధ్యనే రిలీజ్ అయిన బైకర్ సినిమాలో సునీల్ నారాయణ్ పాత్రలో ఆయన ఒదిగిపోయారు. ఈ సినిమా తరువాత పలు సినిమాలతో బిజీగా ఉన్న రాజశేఖర్.. నటుడు రాజా రవీంద్ర నిర్వహిస్తోన్న పాడ్ క్యాస్ట్ లో పాల్గొన్నారు. ఈ పాడ్ క్యాస్ట్ లో ఆయన ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకున్నారు.


సాధారణంగా డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యాము అంటారు. రాజశేఖర్ విషయంలో అది నిజంగానే జరిగింది. చిన్నప్పటి నుంచి డాక్టర్ కావాలని ఆయన ఫ్యామిలీ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ, రాజశేఖర్ ఒక ఏజ్ వచ్చాక యాక్టర్ అవుతానని చెప్పడంతో.. వారు కోపంతో డాక్టర్ అయితే ఇంట్లో ఉండు.. లేకపోతే బయటకు పో అని అన్నారని, వెంటనే తాను ఇంట్లో నుంచి బయటకు వచ్చేసినట్లు రాజేశేఖర్ తెలిపారు.


ఇక జీవితతో ప్రేమ పెళ్లి గురించి ఆయన మాట్లాడుతూ.. ' అందరూ నన్ను ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారు అని అడుగుతారు. ఆవిడ చేసేలా నేను చేశాను అని చెప్తాను. జీవితను ప్రేమించి, ఇంట్లో చెప్పాకా.. మా అమ్మ వేరే అమ్మాయిని నాకోసం చూశారు. ఆమెను, జీవితను తీసుకొని ఒక టెంపుల్ కి వెళ్ళారు. అక్కడ వారిద్దరూ చూసుకొని షాక్. ఎందుకంటే జీవిత, ఆ అమ్మాయి స్కూల్ ఫ్రెండ్స్ అంట. ఈ అమ్మాయే కాదు.. శ్రీదేవి గారి సంబంధం కూడా వచ్చింది. ఈ క్యాస్ట్ అమ్మాయినే పెళ్ళి చేసుకోవాలి అని ఇంట్లో కండీషన్ పెట్టారు. వెంటనే ఈ విషయాలను జీవితకు చెప్పా. పెళ్ళి చేసుకోకుండా ఉంటే చాలా కష్టం. మీరు వేరే పెళ్ళి చేసుకోవాలంటే మీ ఇష్టం. నేను మాత్రం వేరే పెళ్ళి చేసుకోను.. మీకోసమే ఉంటాను అని చెప్పాను' అని చెప్పారు. ఆ తరువాత వీరిద్దరి పెళ్ళి చాలా సింపుల్ గా జరిగింది.


ఇక కథ నచ్చక వదిలేసిన సినిమాలు ఉన్నాయా అంటే.. చంటి, జెంటిల్ మ్యాన్ సినిమాలు తాను చేయాల్సిందని, కానీ చేయలేకపోయాను అని చెప్పారు. 'చంటి సినిమా కోసం చెన్నై నుంచి వచ్చాను. ఆలోపు వెంకటేష్ గారు సినిమా చూసి కొనేశారు. నా మంచితనం నన్ను ముంచేసింది' అని చెప్పారు.

Updated Date - May 03 , 2026 | 03:19 PM