సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

The Raja Saab: రియల్ లైఫ్.. రాజంటే ప్రభాస్

ABN, Publish Date - Jan 06 , 2026 | 09:52 AM

మా సంస్థలోనే అతిపెద్ద చిత్రం ‘రాజాసాబ్‌’. ‘బాహుబలి’కి ముందు ప్రభాస్ ఎలా కనిపించేవారో.. ఇందులో అలానే ఉంటారు.

The Raja Saab

‘మా సంస్థలోనే అతిపెద్ద చిత్రం ‘రాజాసాబ్‌’ (The Raja Saab). ‘బాహుబలి’కి ముందు ప్రభాస్ (Prabhas) ఎలా కనిపించేవారో.. ఇందులో అలానే ఉంటారు. చిత్రంలోని అన్ని అంశాలూ అలరిస్తాయి. సంజయ్‌ దత్ (Sanjay Dutt), బొమన్‌ ఇరానీ (Boman Irani), జరీనా వహాబ్ (Zarina Wahab) పాత్రలు చిత్రానికి ప్రత్యేకాకర్షణగా నిలుస్తాయి’, ఇందులో వింటేజ్‌ ప్రభాస్‌ను చూస్తారు, సినిమా ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుందని నిర్మాత టీజీ విశ్వప్రసాద్ (T. G. Vishwa Prasad) అన్నారు.

పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ (People Media Factory)పై ప్రభాస్‌ కథానాయకుడిగా ఆయన నిర్మించిన చిత్రం ‘ద రాజాసాబ్‌’. దర్శకుడు మారుతి (Maruthi) ఈ హారర్‌ థ్రిల్లర్‌ను తెరకెక్కించారు. నిధి అగర్వాల్ (Nidhhi Agerwal), మాళవికా మోహనన్ (Malavika Mohanan), రిద్ధి కుమార్ (Riddhi Kumar) కథానాయికలు. ఈ నెల 9న చిత్రం విడుదలవుతోంది. ఈ నేప‌థ్యంలో సోమవారం ఈ చిత్రం నుంచి ‘నాచె నాచె’ పాటను మేకర్స్‌ ముంబైలో విడుదల చేశారు. ఇది మిథున్‌ చక్రవర్తి హీరోగా నటించిన అలనాటి బాలీవుడ్‌ చిత్రం ‘డిస్కో డ్యాన్సర్‌’ లోని ‘నాచె నాచె’ సూపర్‌ హిట్‌ సాంగ్‌కు రీమిక్స్‌ కావడం విశేషం.

ఈ సంద‌ర్భంగా నిర్వ‌హించిన మీట్ ది ప్రెస్‌లో.. బొమన్‌ ఇరానీ మాట్లాడుతూ..‘ప్రభాస్‌ తనొక సూపర్‌ స్టార్‌ అని అనుకోరు. తనని అందరూ గొప్పగా ట్రీట్‌ చేయాలని భావించరు. ఈ సినిమాలో ఓ రోల్‌ ఉందని మారుతి ఫోన్‌ చేశారు. ‘ప్రభాస్‌ నటిస్తున్నారా.. అయితే వెంటనే ఓకే చేసేయండి’ అని మా ఆవిడ అన్నారు. ఆమెకు ప్రభాస్‌ అంటే అంతిష్టం. ఆవిడకే కాదు ఆయనంటే అందరికీ ఇష్టమే’ అని బొమన్‌ చెప్పారు. ‘ఈ సినిమాలో ప్రభాస్‌తో నటించినందుకు ఆనందంగా ఉంది’ అని నిధి అగర్వాల్‌ తెలిపారు. ‘తెలుగులో అడుగుపెట్టాలనే నా కోరిక ‘రాజాసాబ్‌’తో తీరింది’ అని మాళవిక మోహనన్‌ పేర్కొన్నారు.

Updated Date - Jan 06 , 2026 | 10:11 AM